Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Year Ender 2023: చంద్రబాబుకు కలిసి రాని ఏడాది-కేసులు, అరెస్టులు, బెయిళ్లు-అదొక్కటే ఊరట..

ఏపీలో విపక్ష నేత చంద్రబాబుకు ఈ ఏడాది అస్సలు కలిసి రాలేదు. కీలకమైన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఎన్నికల ఏడాది సొంత పార్టీ టీడీపీని పరుగులు తీయించాల్సిన పరిస్ధితుల్లో ఆయన వ్యవహరించిన తీరు చివరకు చేటు తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ప్రాజెక్టుల టూర్ పెట్టి వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందికర పరిస్దితుల్లోకి నెట్టేస్తున్న తరుణంలో ఆయనపై కేసుల వల పడింది. తొలుత ప్రకాశం జిల్లా కందుకూరు బహిరంగసభలో తొక్కిసలాట చోటు చేసుకోవడం, ఆ వెంటనే గుంటూరులోనూ దాదాపు ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో మొదలైన కేసుల పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది.

ఎన్నికలకు ముందు ప్రధాన విపక్ష నేత చంద్రబాబును కట్టడి చేయక తప్పని పరిస్ధితి వైసీపీ ప్రభుత్వానికి ఎదురైంది. దీంతో చంద్రబాబు సభల్లో తొక్కిసలాట ఘటనల్ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వం జీవో నంబర్ 1 తీసుకొచ్చి బహిరంగసభల్ని నిషేధించింది. హైకోర్టు ఆదేశాలతో ఆ తర్వాత పునరుద్ధరించారు. అయితే చంద్రబాబుకు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ పన్నుల ఎగవేత వ్యవహారంలో ఐటీ శాఖ నోటీసులు జారీచేయడంతో అసలు కష్టాలు మొదలయ్యాయి.

Year Ender 2023: year of nightmares for chandrababu with serial cases, arrest, pubic meetings ban

అప్పటివరకూ చంద్రబాబుపై సరైన కేసు కోసం ఎదురుచూస్తున్న వైసీపీ సర్కార్ స్కిల్ స్కాంలో చంద్రబాబును ఈ ఏడాది సెప్టెంబర్ 10న అరెస్టు చేసింది. దీంతో ఎన్నికలకు దూకుడుగా సిద్ధం కావాలన్న చంద్రబాబు ఆశలపై పిడుగుపడినట్లయింది. స్కిల్ స్కాంలో అరెస్టు తర్వాత విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో రాజమండ్రి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ 52 రోజుల రిమాండ్ తర్వాత హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.

అయితే చంద్రబాబు స్కిల్ కేసులో జైల్లో ఉండగానే వైసీపీ సర్కార్ మరో అర డజను కేసుల్ని ఆయనపై మోపింది. ఇందులో ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసు, మద్యం అక్రమాల కేసు, ఇసుక అక్రమాల కేసు వంటివి ఉన్నాయి. వీటిలో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేయక తప్పలేదు. చివరికి హైకోర్టు చంద్రబాబుకు బెయిల్ ఇచ్చినా దాన్ని ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసులో విచారణ కూడా పెండింగ్ లో ఉంది. వీటిలో ఏ ఒక్క కేసులో కోర్టు ప్రతికూల ఆదేశాలు ఇచ్చినా వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు చంద్రబాబుకు తీవ్ర ఇబ్బందులు తప్పవు.

Year Ender 2023: year of nightmares for chandrababu with serial cases, arrest, pubic meetings ban

అయితే ఇన్ని కష్టాల మధ్య కూడా చంద్రబాబుకు ఓ గుడ్ న్యూస్ మాత్రం లభించింది. ఎన్నికలకు ముందు తమతో పొత్తు పెట్టుకుంటాడని భావించిన జనసేనాని పవన్ కళ్యాణ్ రాజమండ్రి జైల్లో తాను ఉండగానే వచ్చి పరామర్శించి పొత్తు ప్రకటన చేసేయడం టీడీపీ శ్రేణుల్లో ఆత్మస్ధైర్యం సడలిపోకుండా చేసింది. ఇప్పుడు ఎన్నికలకు ఇరు పార్టీలు ఎలా కలిసి వెళ్లాలన్న దానిపై తదుపరి చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే పరిస్ధితులు తారుమారైతే బీజేపీ పవన్ ను సీఎం చేసేందుకు వెనుకాడకపోవచ్చన్న అంచనాలు చంద్రబాబుకు మెడమీద కత్తి వేలాడదీసేలా ఉన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+