జగన్ కు చంద్రబాబు సర్కార్ బిగ్ షాక్ ..! ఆ కేసులో ఏ2గా - డ్రైవర్ అరెస్ట్ ?

ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు ఇవాళ చంద్రబాబు సర్కార్ పెద్ద షాకే ఇచ్చింది. తాజాగా పల్నాడు జిల్లా టూర్ లో భాగంగా భారీగా తరలివచ్చిన అభిమానుల మధ్యలో నుంచి వేగంగా కారు దూసుకెళ్లడంతో సింగయ్య అనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. తొలుత ఈ ఘటనకు జగన్ కాన్వాయ్ లో అనధికారికంగా వచ్చిన కారే కారణమని భావించినా తాజాగా వీడియో బయటకు రావడంతో అందులో జగన్ కారు కింద పడే అతను చనిపోయినట్లు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఎఫ్ఐఆర్ లో మార్పులు చేసిన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు.. జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని ఈ ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఏ1గా కేసు పెట్టారు. అలాగే జగన్ ను ఏ2గా చేర్చారు. వీరితో పాటు సదరు కారు యజమానిని ఏ3గా చేర్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎఫ్ఐఆర్ లో మార్పులు చేసి కోర్టుకు మెమో సమర్పించాలని పోలీసులు నిర్ణయించారు. దీంతో ఈ కేసులో పోలీసుల తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.

ys jagan as A2 in singaiah death case car driver as A1

మరోవైపు ఈ కేసులో జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ రోజు అతను నడిపిన జగన్ కారు నెంబర్ AP 40 DH 2349గా గుర్తించారు. జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి వైఎస్సార్సీపీ పేరిట ఈ కారు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు 304A సెక్షన్‌ తో కేసు నమోదు చేశారు. ఇప్పుడు జగన్ కారు కింద పడే సింగయ్య చనిపోయినట్లు వీడియో ఆధారాలు లభించడంతో ఎఫ్ఐఆర్ లో అదనంగా 304 పార్ట్ 2 కూడా చేర్చనున్నారు. అలాగే బీఎన్ఎస్ సెక్షన్ 105 ను కూడా చేర్చబోతున్నారు. తద్వారా జగన్ ను కూడా అరెస్ట్ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+