ఏపీలో రాష్ట్రపతి ఎన్నికలు-జగన్ ఓటుతో మొదలు-వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు
ఏపీలో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఏపీ అసెంబ్లీలో జరుగుతున్న ఈ పోలింగ్ ను సీఎం వైఎస్ జగన్ ఓటు వేసి ప్రారంభించారు. అనంతరం మిగతా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. సాయంత్రం వరకూ ఈ ప్రక్రియ కొనసాగునుంది.
Recommended Video


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఇవాళ ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
సీఎం వైయస్ జగన్ తొలుత ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తర్వాత రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, మేరుగు నాగార్జున, ఆర్ కే రోజా, ఉష శ్రీ చరణ్, తానేటి వనితా తదితరులు వరుసగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరి తర్వాత ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

వైసీపీ మంత్రుల తర్వాత ఎమ్మెల్యేలుకూడా వరుసగా అసెంబ్లీకి చేరుకుని ఓటు వేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఓటు వేసేందుకు తరలి వస్తున్నారు. ఇప్పటికే ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎంపికైన ద్రౌపదీ ముర్ముకు వైసీపీ, టీడీపీ ఇరుపార్టీలు ఎంపీలు, ఎమ్మెల్యేలు మద్దతు ప్రకటించాయి. దీంతో ఏపీ నుంచి ముర్ముకు పూర్తి మద్దతు లభిస్తోంది.












Click it and Unblock the Notifications