శాంతి స్వరూప్ మృతిపై స్పందించిన వైఎస్ జగన్, చంద్రబాబు, కేసీఆర్, లోకేష్.. ఏమన్నారంటే!!
తొలి తెలుగు న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఈరోజు మృతి చెందారు. రెండురోజుల క్రితం గుండెపోటుతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ నేడు కన్నుమూశారు. తెలుగుభాషలో వార్తా ప్రపంచానికి స్వాగతం పలికిన తొలి తెలుగు న్యూస్ రీడర్ గా ఆయన సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. చక్కనైన భాషతో, స్పష్టమైన పద ఉచ్చారణతో ఈరోజుకి వార్తలు అనగానే శాంతి స్వరూప్ గుర్తొచ్చేలా అందరి మదిలో నిలిచిపోయారు.
శాంతి స్వరూప్ మృతి.. స్పందించిన జగన్
ఇక శాంతి స్వరూప్ మరణం పట్ల ప్రముఖులు స్పందిస్తున్నారు. ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి శాంతి స్వరూప్ మృతి పట్ల స్పందించారు. ఆయన మృతి పట్ల తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. శాంతి స్వరూప్ కుటుంబానికి తన సానుభూతిని వ్యక్తం చేసిన జగన్ పరిమిత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న రోజుల నుండి శాంతి స్వరూప్ మార్గదర్శక ప్రయత్నం చాలామంది వార్తా ప్రసారకులకు స్ఫూర్తినిచ్చింది అని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు శాంతి స్వరూప్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలుగు దూరదర్శన్ లో వార్తలు అనగానే మొదటిగా మనకు గుర్తొచ్చేది ఆయనే అంటూ చంద్రబాబు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. తాను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తామిద్దరం కలిసి ప్రతి సోమవారం ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం చేసే వారిమన్నారు.
తొలి తెలుగు న్యూస్ రీడర్, యాంకర్, రచయిత శాంతి స్వరూప్ మరణం దిగ్భ్రాంతిని కలిగించింది. తెలుగు దూరదర్శన్ లో వార్తలు అనగానే మొదటగా గుర్తొచ్చేది శాంతి స్వరూప్. నేను ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మేమిద్దరం కలిసి 'ప్రజలతో ముఖ్యమంత్రి' అనే కార్యక్రమాన్ని ప్రతి సోమవారం… pic.twitter.com/2tEBS5wYVJ
— N Chandrababu Naidu (@ncbn) April 5, 2024
ఆయనతో అనుబంధం సుదీర్ఘమైనదన్న చంద్రబాబు
ఆరేళ్ల పాటు సాగిన ఈ కార్యక్రమంలో ప్రజలు నేరుగా తమ సమస్యలను చెప్పుకుని పరిష్కారం పొందే వారని, ఆ విధంగా శాంతి స్వరూప్ తో తన అనుబంధం చాలా సుదీర్ఘమైనదని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్నారు. శాంతి స్వరూప్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు చంద్రబాబు.
తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యారు: లోకేష్
శాంతి స్వరూప్ మృతిపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తన స్పందన తెలియజేశారు. దూరదర్శన్ అంటే వార్తలు.. వార్తలు అంటే శాంతి స్వరూప్ అన్నట్టుగా తెలుగు ప్రేక్షకులకు ఆయన దగ్గరయ్యారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు.
తొలితరం న్యూస్ రీడర్ గా గుర్తింపు : కేసీఆర్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శాంతి స్వరూపం మృతి పట్ల తన సంతాపాన్ని ప్రకటించారు టీవీలో వార్తలు చదివే తొలి తరం న్యూస్ రీడర్ గా ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారని కెసిఆర్ పేర్కొన్నారు. మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. శాంతి స్వరూప్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications