అదే ఆవేదన, అందుకే బాబును కాల్చివేయాలన్నాను!: ఈసీకి జగన్ వివరణ

Posted By:
Subscribe to Oneindia Telugu

నంద్యాల: నంద్యాల బహిరంగ సభలో తాను చేసిన వ్యాఖ్యలపై వైసిపి అధినేత వైయస్ జగన్ ఎన్నికల సంఘానికి మంగళవారం నాడు వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యల వెనుక ఎలాంటి దురుద్దేశ్యం లేదని చెప్పారు.

ఆ ఆవేదనతో కాల్చివేత వ్యాఖ్యలు

ఆ ఆవేదనతో కాల్చివేత వ్యాఖ్యలు

2014 ఎన్నికల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు. అందులో ఒక్కటి కూడా ఆయన అమలుపరచలేదని తెలిపారు. ఆ ఆవేదనతోనే తాను కాల్చివేత వ్యాఖ్యలు చేశానని చెప్పారు.

YS Jagan Shock To Bhuma Akhila Priya
నంద్యాల సభలో వ్యాఖ్యలు

నంద్యాల సభలో వ్యాఖ్యలు

ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబును నడిరోడ్డుపై కాల్చినా తప్పులేదని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రా లేక ముఖ్య కంత్రియా అని ప్రశ్నించారు.

దుమారం

దుమారం

జగన్ చేసిన కాల్చివేత వ్యాఖ్యలు దుమారం రేపాయి. నంద్యాల ఉప ఎన్నికల్లు తెలుగుదేశం పార్టీ నేతలు ఈ వ్యాఖ్యలతోనే వైసిపిని టార్గెట్ చేశారు. జగన్ వ్యాఖ్యలపై అధికార పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు.

వివరణ కోరిన ఈసి

వివరణ కోరిన ఈసి

జగన్ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం ఆయనకు నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేఫథ్యంలో ఆయన మంగళవారం ఈసీకి వివరణ ఇచ్చారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
YSR Congress Party chief YS Jaganmohan Reddy on Tuesday clarifed to Election Commission why he make hot comments on Andhra Pradesh CM Nara Chandrababu Naidu.
Please Wait while comments are loading...