ys జగన్ కు, 40 సంఖ్యకు అవినాభావ సంబంధం?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. గెలుపా? ఓటమా? అంటూ మనకు ఆప్షన్ లేదని, కచ్చితంగా గెలిచి తీరాల్సిందేనని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతలకు లక్ష్యాన్ని నిర్దేశిస్తున్నారు. మొహమాటాలు తనకు లేవని, తనతో ఎంత చనువుగా ఉన్నా గెలుస్తారు అని తన సర్వేలో తేలితేనే సీటిస్తానని, ఆ తర్వాత తనను విమర్శించుకున్నా ఎటువంటి ఇబ్బంది లేదని వారికి చెప్పేస్తున్నారు.

అనంతపురంపై దృష్టిసారించాలి!
రాయలసీమలో 2019 ఎన్నికల్లో మొత్తం 52 నియోజకవర్గాలకు గాను వైసీపీ 49 సీట్లలో విజయకేతనం ఎగరవేసింది. 2014 ఎన్నికల్లో 30 సీట్లు గెలుచుకుంది. ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో వెనకబడింది. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ వైసీపీకే ఇక్కడ అనుకూలంగా ఉంటుంది.
జగన్ ఈసారి 175 సీట్లు గెలుచుకోవాలని చెబుతుండటంతో సీమలో అన్ని నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్ చేయాలనే నిర్ణయానికి వచ్చారు. తాజాగా రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన నేతలతో పార్టీ సీనియర్ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు.

ఈసారి సీమలో 40 గెలుచుకోవాల్సిందే!
రాయలసీమలో కచ్చితంగా 40 సీట్లు గెలుచుకోవాలని పార్టీ నిర్ణయించింది. కడప జిల్లా గురించి తమకు ఎటువంటి ఇబ్బందులు లేవని, ఈసారి కచ్చితంగా క్లీన్ స్వీప్ చేయాలంటూ లక్ష్యాన్ని నిర్దేశించారు. సీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఈసారి సీట్లు ఎక్కడెక్కడ తగ్గే అవకాశం ఉంది? ఏ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలపడుతోంది? ఎక్కడ వైసీపీ నేతలు పనిచేయడంలేదు? ఏయే నియోజకవర్గాల్లో పార్టీకి మైనస్ అంశాలున్నాయి?.. సీటు కోసం ఒకరికి మించి ఇద్దరు, ముగ్గురు పోటీపడుతున్న నియోజకవర్గాలేంటి? తదితర వివరాలను విశ్లేషించారు.

సీమలో 20 నియోజకవర్గాల్లో బలంగా టీడీపీ?
ప్రస్తుతం సీమలో తెలుగుదేశం 20 నియోజకవర్గాల్లో బలంగా ఉందని, వైసీపీ 34 సీట్లు గెలుచుకుంటుందని ఈ సమావేశంలో పార్టీ నేతలు అంచనాకు వచ్చారు. సీమకు సంబంధించి వచ్చే ఎన్నికల్లో వైసీపీ టార్గెట్ 40 లక్ష్యంగా పెట్టుకుందని, వాటిని సాధించేందుకు అందరూ కష్టపడాల్సిందేనని వారికి చెప్పారు. ఉండాల్సిందేనన్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ నేతలు పార్టీ గాలి వీస్తే గెలుస్తామనే లెక్కలో ఉన్నారని, అటువంటి నేతల నియోజకవర్గాలను గుర్తించి వైసీపీ తరఫున గట్టిగా పనిచేస్తే విజయం సులభమవుతుందనే అభిప్రాయానికి వచ్చారు.












Click it and Unblock the Notifications