రోజా పట్ల ఇంత దారుణంగానా? పిలిచి ఇలా చేస్తారా: జగన్ అసహనం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పైన ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే, నటి రోజా పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు పైన ఆ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా ఆయన స్పందించారు. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు ఆహ్వానించి, మరీ ఎమ్మెల్యే రోజాను అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు.

ఒక మహిళా ఎమ్మెల్యే పట్ల ప్రభుత్వమే ఇలా వ్యవహరిస్తే, ఇక సమాజంలోని సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడ లభిస్తుందని ఆయన నిలదీశారు. వారే ఆహ్వానించి, అడ్డుకోవడం సరికాదన్నారు.

roja - ys jagan

కాగా, రోజా సినీ రంగం తరహాలో రాజకీయాల్లోనూ నటిస్తున్నారని మంత్రి పీతల సుజాత శనివారం విమర్శించారు. మహిళా సదస్సును అడ్డుకునేందుకు రోజా యత్నించారని ఆమె ఆరోపించారు. రాష్ట్ర రాజధాని నిర్మాణంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్న వైసిపి,క మహిళా సదస్సుకు కూడా అడ్డుపడటం తగదన్నారు.

జాతీయ మహిళా సదస్సుకు రోజాకు ఆహ్వానం పంపినట్టు ఎమ్మెల్యే అనిత తెలిపారు. అయితే కార్యక్రమానికి ఆటంకాలు సృష్టిస్తారన్న నిఘావర్గాల సమాచారంతో ముందు జాగ్రత్తగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. రోజా రాజకీయ జీవితానికి టిడి పునాది వేసిందన్న అంశాన్ని అనిత గుర్తు చేశారు.

ఇదిలా ఉండగా, అమరావతిలో జరుగుతున్న జాతీయ మహిళా పార్లమెంట్‌ సదస్సులో ఆందోళన చేస్తారన్న కచ్చితమైన సమాచారంతోనే రోజాను ముందస్తుగా అరెస్ట్ చేసినట్టు ఏపీ డీజీపీ సాంబశివరావు శనివారం వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+