జోగి రమేశ్ అరెస్టు వెనుక ? జగన్ సంచలన ట్వీట్..!

ఏపీలో కల్తీ మద్యం కేసులో దొరికిన టీడీపీ నేతల్లో ఒకరైన జనార్ధన్ రావు వాంగ్మూలం ఆధారంగా వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ ను పోలీసులు అరెస్టు చేయడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ అరెస్టుపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. మీ నకిలీ మద్యం ఫ్యాక్టరీలు బయటపడ్డ వ్యవహారంలో అడ్డంగా మీరు దొరికిపోయి, దీని నుంచి తప్పించుకోవడానికి నిస్సిగ్గుగా కుట్రలకు పాల్పడుతూ మా పార్టీకి చెందిన బీసీ నాయకుడు, మాజీ మంత్రి జోగిరమేష్‌ను అన్యాయంగా అరెస్టు చేశారని జగన్ ఆరోపించారు. ముమ్మాటికీ ఇది అక్రమ అరెస్టు అంటూ ఖండించారు.

గత 18 నెలలుగా ప్రభుత్వం మీది పాలన మీది. పట్టుబడ్డ నకిలీ మద్యం మీ హయాంలోనిది. పట్టుబడ్డవారిలో మీ పార్టీనుంచి ఎన్నికల్లో పోటీచేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు, మీతోనూ, మీ కొడుకుతోనూ, మీ మంత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ, అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే అంటూ చంద్రబాబును ఉద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. మీరు తయారు చేసిన మీ నకిలీ మద్యాన్ని అంతా అమ్మేది, మీరు తీసుకు వచ్చిన మీ ప్రైవేటు లిక్కర్‌ షాపుల్లోనే, మీ కార్యకర్తలు, నాయకులు నడిపే బెల్టుషాపుల్లోనే, పర్మిట్‌ రూముల్లోనే. మరి తయారీ మీది, చేసిన వారు మీవారు, అమ్మేదీ మీరే, కాని బురదజల్లేది, అక్రమ అరెస్టులు చేసేది మాత్రం మావాళ్లని అన్నారు.

ys jagan condemns ysrcp leader jogi Ramesh arrest in liquor case says for diverting stampede

నిన్న కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టిమళ్లించడానికి, మోంథా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడును పక్కదోవపట్టించడానికి ఈ అక్రమ అరెస్టుకు పాల్పడి, దుర్మార్గానికి ఒడిగట్టారని జగన్ ఆరోపించారు. నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలంటూ జోగిరమేష్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబు .. మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థం అవుతోందన్నారు.

ys jagan condemns ysrcp leader jogi Ramesh arrest in liquor case says for diverting stampede

నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సీబీఐ చేత విచారణకు భయమెందుకు చంద్రబాబు అని ప్రశ్నించారు. ఎందుకు వెనకడుగు వేస్తున్నారని అడిగారు. మీ జేబులో ఉన్న సిట్‌ మీరు ఏం చెప్తే అది చేస్తుందని, మీరు సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయించడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమి ఆశించగలమంటూ జగన్ ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+