జగన్ కామెంట్స్ పై జాతీయ స్ధాయిలో చర్చ..! అదే టర్నింగ్ కాబోతోందా ?

జాతీయ స్ధాయిలో చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావం అనివార్యంగా ఏపీపైనా పడుతోంది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘంలో విభేదాలు, ఎన్నికల కమిషనర్ల నియామకాలపై జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఇన్నాళ్లూ బీజేపీకి మద్తతుగా నిలిచిన వైఎస్సార్సీపీ క్రమంగా స్టాండ్ మార్చేస్తోంది. ముఖ్యంగా బీజేపీపై పోరాటం చేస్తున్న కాక్రోచ్ లకు వైఎస్ జగన్ (YS Jagan) మద్దతివ్వడం, అలాగే గతంలో తాము మద్దతిచ్చిన ఎన్నికల కమిషనర్ల నియామకాల బిల్లుపై యూటర్న్ తీసుకోవడం చర్చనీయాంశమవుతోంది. దీనికి ఇవాళ జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి.

హింసను అడ్డుకోలేని ఎస్ఈసీ..! చంద్రబాబు వీరవిధేయుడు- పునేఠాపై జగన్ ఫైర్..!
హింసను అడ్డుకోలేని ఎస్ఈసీ..! చంద్రబాబు వీరవిధేయుడు- పునేఠాపై జగన్ ఫైర్..!

ఎన్నికల కమిషనర్ల నియామకాల చట్టానికి 2023లో కేంద్రం మార్పులు చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకాలు చేపట్టే కమిటీలో ప్రధాని, విపక్ష నేతతో పాటు ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి స్ధానంలో ప్రధాని సిఫార్సు చేసే కేంద్రమంత్రిని చేరుస్తూ పార్లమెంట్ లో పెట్టిన బిల్లుకు మిగతా పార్టీలతో పాటు వైసీపీ కూడా మద్దతిచ్చింది. ఇప్పుడు ఆ బిల్లుకు మద్దతిచ్చు తప్పుచేశామని, దీనిపై పశ్చాత్తాపపడుతున్నట్లు జగన్ ఇవాళ వ్యాఖ్యానించారు. ఆ బిల్లుకు సవరణలు చేసి ప్రధాని, విపక్ష నేతతో పాటు ఛీఫ్ జస్టిస్ కూడా ఉండేలా మార్చాలని జగన్ డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలపై జాతీయ స్ధాయిలో చర్చ జరుగుతోంది.

YS Jagan Faces Questions Over Election Commissioners Bill Stand Will YSRCP Skip Delimitation Debate
సీఈసీ, ఎస్ఈసీల ఎంపిక అలా జరగాల్సిందే..! జగన్ కీలక డిమాండ్..!
సీఈసీ, ఎస్ఈసీల ఎంపిక అలా జరగాల్సిందే..! జగన్ కీలక డిమాండ్..!

ఈ మేరకు జగన్ వ్యాఖ్యల వీడియోను పలువురు సీనియర్ జర్నలిస్టులు ట్వీట్లు చేస్తుండగా.. వాటికి రాజకీయ పార్టీలు స్పందిస్తున్నాయి. గతంలో జగన్ కేంద్రానికి మద్దతిచ్చిన పలు బిల్లుల్ని సైతం ఇప్పుడు వారు తెరపైకి తెస్తున్నారు. ఇందులో ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి మద్దతుగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల తర్వాత కేంద్రం హడావిడిగా లెఫ్టినెంట్ గవర్నర్ కు ఎక్కువ అధికారాలు ఉండేలా తెచ్చి సవరణ బిల్లుకు సైతం జగన్ ఇచ్చిన మద్దతును గుర్తుచేస్తున్నారు. అలాగే త్వరలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్రం తీసుకురాబోతున్న డీలిమిటేషన్-మహిళా బిల్లులపై జగన్ వైఖరి ఎలా ఉండబోతోందో చూద్దామంటూ పలువురు స్పందిస్తున్నారు. వాటిలో తిరిగి బీజేపీకి మద్దతిస్తే మాత్రం కాక్రోచ్ జనతా పార్టీతో పాటు ఇండియా కూటమి పార్టీలు కూడా జగన్ ను దూరం పెట్టాలంటూ మరికొందరు సూచిస్తున్నారు. ఇలా ఈసీల చట్టంపై జగన్ వ్యాఖ్యలు పలు రకాలుగా చర్చనీయాంశమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+