వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైసీపీ ఎమ్మెల్యేలకు జగన్ హెచ్చరికలు-ఆరునెలలు చూస్తా-మీకోసం పార్టీ పణంగా పెట్టలేను..

|
Google Oneindia TeluguNews

ఏపీలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న వైసీపీ.. తమ పార్టీపై, ప్రభుత్వంపై క్షేత్రస్ధాయిలో ఉన్న ఫీడ్ బ్యాక్ తెలుసుకునేందుకు గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా ప్రతీ ప్రజాప్రతినిధీ హాజరు కావాలని జగన్ టార్గెట్ పెట్టారు. అయినా కొందరు ఇంకా కదలడం లేదు. దీనిపై సీఎం జగన్ ఇవాళ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

గడప దాటని వైసీపీ ఎమ్మెల్యేలు

గడప దాటని వైసీపీ ఎమ్మెల్యేలు


వైసీపీని మరోసారి అధికారంలోకి తెచ్చేందుకు కీలకంగా భావిస్తున్న గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమం అమలుపై సమీక్షించేందుకు ఇవాళ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఇందులో
వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరుపై ఐ పాక్ నివేదిక తెప్పించుకున్న జగన్. .పార్టీ నేతలు ఎవరు ఎలా పని చేస్తున్నారో తెలుసుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఏడుగురు ఎమ్మెల్యేలు అసలు పాల్గొన లేదని నివేదిక అందింది. ఇందులో ఏలూరు, కోవూరు, శ్రీశైలం, మైలవరాల్లో అసలు కార్యక్రమం జరగలేదని తేలింది. పులివెందుల, చీపురుపల్లి నియోజకవర్గాలకు మినహాయింపు ఇచ్చారు.

ఎమ్మెల్యేలపై జగన్ ఫైర్

ఎమ్మెల్యేలపై జగన్ ఫైర్

గడప గడపకు మన ప్రభుత్వం వర్క్ షాప్ లో ఎమ్మెల్యే పని తీరుపై సీఎం జగన్ ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు.
తాను స్వయంగా చెప్పినా పలువురు ఎమ్మెల్యేలు గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనకపోవడంపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల పాటు ఎమ్మెల్యేలు, మంత్రుల పని తీరు చూస్తామన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సరిగా చేయని వారిని ఆరు నెలల తరువాత ఉపక్షించేది లేదన్నారు. మీకోసం పార్టీ ని పణంగా పెట్టలేనని జగన్ హెచ్చరికలు జారీ చేశారు.

 కుప్పం టార్గెట్ అన్న అంబటి

కుప్పం టార్గెట్ అన్న అంబటి


గడప గడపకూ ప్రభుత్వం వర్క్ షాప్ లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు కార్యక్రమం అమలుపై స్పందించారు.
175కు 175 సీట్లు సాధించడమే లక్ష్యంగా పనిచేస్తామని అంబటి తెలిపారు. కుప్పం కూడా తమ టార్గెట్ లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. కుప్పం మున్సిపాలిటీని సాధించామని, స్ధానిక సంస్ధల్లో అద్భుత ఫలితాలు సాధించామని,
రెండేళ్ళ తరువాత వచ్చే ఎన్నికల్లో సంక్షేమం అభివ్రుద్దితో 175 సీట్లు సాధిస్తామని అంబటి వెల్లడించారు.
సోదిమహేశ్వరరావు నామీద సిఐడికి ఫిర్యాదు చేస్తే ఏమవుతుందంటూ దేవినేని ఉమపై అంబటి మండిపడ్డారు.
తాను మంత్రి పదవికి రాజీనామా చేయాలని, బర్తరఫ్ చేయాలని , అరెస్టు అవ్వాలని ఆయన కలలు కంటున్నాడన్నారు

8 నెలల్లో తలరాతలు తేలిపోతాయన్న జోగి రమేష్

8 నెలల్లో తలరాతలు తేలిపోతాయన్న జోగి రమేష్

గడప గడపకు వెళ్లినప్పుడే ప్రజా సమస్యలు తెలుస్తాయని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. 2024 లో 175 స్ధానాల్లో వైసిపి గెలవడానికి ముఖ్యమంత్రి ప్రణాళికలు చెప్పారని ఆయన వెల్లడించారు. 175 స్ధానాలు గెలవడం ఖచ్చితంగా ఖాయమన్నారు. గతంలో కోవిడ్ కారణంగా ప్రజల్లోకి వెళ్లలేకపోయామని, ఇక ప్రజల్లోనే ఉంటామన్నారు. గ్రామాల్లో వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించాలన్నారు. ప్రతీ నెలలో వర్క్ షాపు ఉంటుందని, వచ్చే ఎనిమిదినెలల్లో ఎమ్మెల్యేల తల తలరాతులు తెలిసిపోతాయని జోగి రమేష్ తెలిపారు. తూతూ మంత్రంగా గడప గడప కు చేపడితే సరికాదని, అటువంటి వారి గ్రాఫ్ వెంటనే బయటపడిపోతుందన్నారు.

నో వన్ లెఫ్ట్ బిహైండ్ నినాదం

నో వన్ లెఫ్ట్ బిహైండ్ నినాదం

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం లో ఇంకా ఎలా ఇంప్రూవ్ మెంట్ తీసుకురావాలి అనేది చర్చించామని మరో మంత్రి అమర్నాథ్ తెలిపారు. ప్రజల నుండి ఎలా రెస్పాన్స్ వుంది అనేది సీఎం అడిగారని, ప్రజల్లో సంతృప్త స్థాయి ఎలా వుందో ఎలా వుంది చర్చించామని ఆయన పేర్కొన్నారు. కోటి 40 లక్షల కుటుంబాలకు ఎలా సంక్షేమ పథకాలు ఎలా దరి చేర్చామో చర్చించారని మంత్రి తెలిపారు. రెండు రోజులు కాకుండా 3 రోజులు సెక్రటేరియట్ కు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. నో వన్ లేఫ్ట్ బిహైండ్ అనేది నినాదంగా 175కు చేరుకోవాలని మంత్రి అమర్నాథ్ సూచించారు. కొంతమంది ఇష్యూలు విషయము లో ప్రోటోకాల్ ఫిక్స్ చేశారని, ఎక్కడైనా సమయం సరిపోక పోతే..టైం తీసుకుని అయిన ప్రతి ఇల్లు టచ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

English summary
ap cm ys jagan on today made key comments in a workshop conducted over ysrcp's gadapa gadapaku prabhutvam programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X