గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గుంటూరులో వైయస్ జగన్ దీక్ష తేదీ ఖరారు, టీడీపీ నేతలపై నెహ్రూ మండిపాటు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

గుంటూరు: ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ చేపట్టనున్న దీక్ష తేదీని పార్టీ నేతలు ప్రకటించారు. ఈ నెల 26 నుంచి గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష చేయనున్నట్లు బుధవారం మీడియా సమావేశంలో తెలిపారు.

ఈరోజు జరిగిన సమావేశంలో వైయస్ జగన్ ఏపీలోని అన్ని జిల్లాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. పార్టీ నేతలతో చర్చించిన తర్వాతనే వైయస్ జగన్ ఈ తేదీని ఖరారు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ కమిటీల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అదేశించారు.

Ys Jagan indefinite hunger strike on september 26th at Guntur

ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఈనెల 15 నుంచి గుంటూరులో నిరాహార దీక్ష చేపట్టాలని ఇంతక ముందు జగన్ నిర్ణయించారు. అయితే 17వ తేదీన వినాయక చవతి పండుగ ఉండటంతో పార్టీ నేతలు, కార్యకర్తలు సూచన మేరకు దీక్ష తేదీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

టీడీపీ నేతలపై నెహ్రూ మండిపాటు

దివంగత నేత రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాజెక్టుల ఫలితాలను తమవిగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేసుకుంటోందని వైసీపీ నేత జ్యోతుల నెహ్రూ మండిపడ్డారు. నదుల అనుసంధానం చేశామని టీడీపీ నేతలు సంబరాలా చేసుకుంటున్న నేపథ్యంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ఈ సందర్భంగా ఆయన ఏలూరు దగ్గర కృష్ణా, గోదావరి నదుల అనుసంధానం ఎప్పుడో జరిగిందని గుర్తు చేశారు. మోసపూరిత ప్రకటనలో ప్రజలను చంద్రబాబు మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మాయల గారడీ ప్రభుత్వం ప్రజలను పాలిస్తోందని, దానికి నాయకుడు మహా మాంత్రికుడని ధ్వజమెత్తారు.

వాస్తవాలనకు దగ్గర ఆలోచన చేయాలని, ప్రభుత్వాన్ని సమర్ధవంతంగా నడిపించాలన్నారు. రైతాంగానికి ఎగనామం పెట్టే పనులు చేయొద్దన్నారు.

English summary
Ys Jagan indefinite hunger strike on september 26th at Guntur.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X