రూ.72,000 చొప్పున చంద్రబాబు ప్రభుత్వం బాకీ- లెక్కలతో జగన్ లా పాయింట్లు

YS Jagan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన యువత పోరు విజయవంతమైంది.

తొలి హెచ్చరిక..

ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు సంధించారు. ఈ ఆందోళన విజయవంతం కావడాన్ని తొలి హెచ్చరికగా అభివర్ణించారు. యువత పోరును అణచివేయడానికి కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించిందంటూ ఆరోపించారు.

చదువులకు దూరం చేసే కుట్ర..

పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే చంద్రబాబు ప్రభుత్వ కుట్రపై తాము ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించిన యువత పోరు ద్వారా గళమెత్తిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి కదం తొక్కారని చెప్పారు.

YSJagan

కూటమి ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై..

అధికారంలోకి వచ్చింది మొదలుకుని కూటమి ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నిలదీశారని, నిరుద్యోగులు, విద్యార్థులు మీకు పంపిన తొలి హెచ్చరిక అన్నారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ హయాంలో అమలుచేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు జగన్.

విద్యా దీవెన ద్వారా..

పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో తమ ప్రభుత్వం విద్యా దీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, వసతి దీవెన ద్వారా హాస్టల్‌, మెస్‌ ఛార్జీలను నేరుగా వారి తల్లులు, ఆ పిల్లల ఖాతాలకే జమ చేశామని, ఆయా పథకాలను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందని అన్నారు. గత పాలనలోని చీకటి రోజులనే మళ్లీ తీసుకొచ్చారని విమర్శించారు.

ప్రతి త్రైమాసికానికి 700 కోట్లు..

2024 జనవరి- మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ నిధులను ఏప్రిల్‌లో వెరిఫై చేసి, మేలో చెల్లించాల్సి ఉందని, అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ప్రతి త్రైమాసికానికి 700 కోట్ల రూపాయల చొప్పున ఏడాదికి 2,800 కోట్ల రూపాయలను ఇవ్వాల్సి ఉందని జగనన్ వివరించారు. వసతి దీవెన కింద హాస్టల్‌ ఖర్చులకు మరో 1,100 కోట్ల రూపాయలను చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.

ఇచ్చింది రూ.700 కోట్లే..

ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు 3,900 కోట్ల రూపాయలను ఖర్చు చేయాల్సి ఉండగా.. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది 700 కోట్ల రూపాయలేనని గుర్తు చేశారు. అది కూడా ఇప్పటికీ పూర్తిగా విద్యార్థులందరికీ చేరలేదని పేర్కొన్నారు. అంటే గత ఏడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు, ఈ ఏడాది ఖర్చుచేయాల్సిన మరో రూ.3,900 కోట్లు, రెండూ కలిపితే రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చుపెట్టాల్సి ఉందని జగన్ తెలిపారు.

తప్పించుకుంటున్నట్టే కదా..

ఈ బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది కేవలం 2,600 కోట్ల రూపాయలు మాత్రమేనని జగన్ గుర్తు చేశారు. దీని అర్థం- పేద విద్యార్థుల చదువులు, వారి బాధ్యత విషయంలో తప్పించుకుంటున్నట్టే కదా? అని ప్రశ్నించారు. ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెడుతున్నట్టే కదా? చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కాదా? విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని నిలదీశారు.

నెలకు 3,000 రూపాయల భృతి..

అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు లేదా అప్పటివరకు నెలకు 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారని జగన్ గుర్తు చేశారు. ఉద్యోగాలు ఇవ్వట్లేదు సరికదా తమ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను కూడా ఊడపీకుతున్నారని ఆరోపించారు.

ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ..

నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ప్రతి ఏటా 7,200 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉండగా.. గత ఏడాది బడ్జెట్‌లో ఒక్క పైసా కేటాయింపూ లేదని, ఈ ఏడాదికి కూడా ఒక్కపైసా కేటాయించలేదని జగన్ విమర్శించారు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ 72,000 రూపాయలు చొప్పున చంద్రబాబు ప్రభుత్వం బకాయి పడిందని అన్నారు.

మెడికల్‌ విద్యను సైతం..

అలాగే తమ హయాంలో తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ, పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాదు, పేద విద్యార్థులకు మెడికల్‌ విద్యను సైతం చంద్రబాబు ప్రభుత్వం దూరం చేస్తోందని జగన్ ధ్వజమెత్తారు.

ప్రజల పక్షాన నిలుస్తూ..

వచ్చి ఏడాది కూడా కాకముందే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, నిరుద్యోగులు, ఇంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా అని జగన్ ప్రశ్నించారు. ప్రజల పక్షాన నిలుస్తూ, విద్యార్థుల సమస్యలపై, వారి కోసం చంద్రబాబు కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు, వారి తల్లిదండ్రులు, నిరుద్యోగులను అభినందిస్తున్నానని, ఇందులో పాల్గొన్న ప్రత ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేస్తోన్నానని జగన్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+