జగన్ కు రాఖీ కట్టిన మహిళా నేతలు..! వైసీపీ కార్యాలయంలో రక్షాబంధన్..!

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఇవాళ రాఖీ పౌర్ణమి (raksha bandhan) సంబరాలు జరిగాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా పార్టీ అధినేత వైయస్‌ జగన్ కు (ys jagan) పలువురు మహిళా నాయకులు రాఖీలు కట్టారు. వివిధ ప్రాంతాలు నుంచి తరలివచ్చిన మహిళా నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు జగన్ కు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. దీంతో పార్టీ కార్యాలయంలోసందడి నెలకొంది.

AP Local Body Polls: హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల బంతి..! తేడా వస్తే సర్కార్ ప్లాన్ బీ..!
AP Local Body Polls: హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల బంతి..! తేడా వస్తే సర్కార్ ప్లాన్ బీ..!

రాఖీ పౌర్ణమి సందర్భంగా తరలివచ్చిన పార్టీ మహిళా నేతలు ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌కు రాఖీలు కట్టి స్వీట్లు కూడా తినిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలకు ప్రతీకగా నిలిచే రాఖీ పౌర్ణమి సందర్భంగా వైయస్‌ జగన్‌ను కలిసి రాఖీ కట్టడం ఆనందంగా ఉందని మహిళా నాయకులు పేర్కొన్నారు. అలాగే తనకు ఆప్యాయంగా రాఖీలు కట్టిన మహిళలకు జగన్‌ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. వారితో కాసేపు ఆత్మీయంగా మాట్లాడి, కుటుంబ సభ్యుల క్షేమ సమాచారాన్ని కూడా అడిగి తెలుసుకున్నారు.

YS Jagan Receives Rakhis From YSRCP Women Leaders on Raksha Bandhan
కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ?
కూటమి ఆ ఒక్క నిర్ణయం వైసీపీకి ఊపిరి పోస్తుందా ? చరిత్ర ఏం చెబుతోంది ?

రాష్ట్రంలోని ప్రతి అక్కాచెల్లెమ్మ ఆనందంగా, సురక్షితంగా ఉండాలని, వారి కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలని జగన్ ఈ సందర్బంగా ఆకాంక్షించారు. రాఖీ పౌర్ణమి ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మహిళా నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చి పార్టీ నాయకులకు రాఖీలు కట్టడం కనిపించింది. రాఖీ పౌర్ణమి నేపథ్యంలో నిత్యం చేసే రాజకీయాలు పక్కనబెట్టి వైఎస్సార్సీపీ నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకోవడం విశేషం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+