పులివెందులలో ఓటు వేయడానికి నిరాకరించిన జగన్: అలా చేస్తే.. !!

రాష్ట్రవ్యాప్తంగా ఈ ఉదయం స్థానిక సంస్థల పోలింగ్ ఆరంభమైంది. పలుచోట్ల తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రత్యేకించి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టు ఉన్న మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల వద్ద భీతావహ వాతావరణం నెలకొన్నట్లు చెబుతున్నారు. ఆయా చోట్ల ఓటింగ్ ను టీడీపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకుంటోన్నారని, పోలీసుల సహకారంతో తమ పార్టీ ఏజెంట్లను సైతం పోలింగ్ కేంద్రాల నుంచి బయటికి పంపేస్తోన్నారని వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది.

ఈ పరిస్థితుల మధ్య కడప జిల్లా పులివెందులలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. పులివెందులలో టీడీపీ బూత్ క్యాప్చరింగ్, రిగ్గింగ్ కు పాల్పడుతోందని ఆరోపిస్తూ వైఎస్ జగన్ రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. అక్కడే బైఠాయించారు. పులివెందుల టౌన్ లో 80 బూత్ లల్లో దాదాపు 70 కేంద్రాల్లో తమ పార్టీ పోలింగ్ ఏజెంట్లను లోపలికి వెళ్లకుండా పోలీసులు, ప్రత్యర్థి వర్గాలు అడ్డుకున్నాయని అన్నారు.

YS Jagan returned without casting his vote in Pulivendula during local body poll alleged malpractices

తన ఓటు హక్కును కూడా జగన్ వినియోగించుకోలేదు. ఓటు వేయకుండానే వెనుదిరిగారు. ప్రజాస్వామ్య ప్రక్రియ దుర్వినియోగమైందంటూ ఓటు వేయకుండానే నిష్క్రమించారు. దీనికి గల కారణాన్నీ వివరించారు. తాను ఓటు వేస్తే.. అప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ జరుగుతున్న పోలింగ్ ను సమర్థించినట్టవుతుందని జగన్ పేర్కొన్నారు. పోలింగ్ ను రద్దు చేసి, రీపోలింగ్ నిర్వహిస్తేనే ఓటు వేస్తానని ఆయన తేల్చి చెప్పారు.

ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు
ఏపీ మీదుగా పట్టాలెక్కిన బెంగళూరు వందే భారత్ స్లీపర్: 8 హాల్ట్ స్టేషన్లు

ప్రజాస్వామ్యాన్ని కాపాడే అధికారం రిటర్నింగ్ అధికారి చేతుల్లో ఉందని, మనస్సాక్షిని అడిగి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రిటర్నింగ్ అధికారి తీసుకునే నిర్ణయం ఒక్క పులివెందుల ఎన్నికలకే పరిమితం కాదు. రాష్ట్రంలో, దేశంలో భవిష్యత్తు ఎన్నికలు ఎలా జరగాలన్న దానికి కూడా ఒక ప్రమాణంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆర్ఓకు పైస్థాయి నుంచి ఒత్తిళ్లు రావొచ్చని, అయినప్పటికీ తన చేతుల్లో ఉన్న అధికారంతో బాధితులకు గానీ, ప్రజాస్వామ్యానికి గానీ, పోలింగ్ ప్రక్రియకు గానీ న్యాయం చేయవచ్చని జగన్ చెప్పారు.

పులివెందులలో జగన్ కారును అడ్డుకున్న దస్తగిరి
పులివెందులలో జగన్ కారును అడ్డుకున్న దస్తగిరి

ఇప్పుడు ఆర్ఓ మౌనంగా ఉంటే ప్రజాస్వామ్యం శాశ్వతంగా చితికిపోతుందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఎన్నికలే జరగని పరిస్థితి వస్తుందని, ఓ మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడి నియోజకవర్గంలోనే ఇంత దారుణంగా ఎన్నికలు జరిగితే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుతుందని అన్నారు. పులివెందులలో అక్రమాలకు సంబంధించి తమ దగ్గర వందలాది వీడియో ఆధారాలు ఉన్నాయని జగన్ అన్నారు. కొన్ని ప్రాంతాల్లో సీసీటీవీ ఫుటేజ్‌ కూడా ఉందని, వాటి ఆధారంగా విచారణ జరిపించాలని, రీపోలింగ్ కు ఆదేశించాలని కోరారు.

బంగారం ధరల్లో భారీ ఉపశమనం
బంగారం ధరల్లో భారీ ఉపశమనం

రిగ్గింగ్, ఓట్ల రీసైక్లింగ్‌ విచ్చలవిడిగా జరుగుతోందనే విషయం బహిరంగ రహస్యమేనని పేర్కొన్నారు. తమ పార్టీకి చెందిన ఏజెంట్లను పోలింగ్‌ కేంద్రాల నుంచి బయటకు పంపడం, పాసులను లాక్కోవడం వంటి ఘటనలు పోలీసుల సహకారంతోనే జరిగాయని జగన్ ఆరోపించారు. కొన్ని బూత్‌లను టీడీపీ శ్రేణులు తమ ఆధీనంలోకి తీసుకున్నాయని, తమ మనుషులను ముందుగానే అక్కడ కాపలా పెట్టుకున్నారని జగన్ వివరించారు.

ఓటు వేయడానికి వచ్చిన వారిని అడ్డుకోవడమే కాకుండా ఓటర్‌ స్లిప్పులను చింపేసి, ఓటు వేసేశారని చెప్పి వెనక్కి పంపిస్తున్నారని, ఓటర్లను గుర్తించి, అక్రమాలను ప్రశ్నించాల్సిన పోలింగ్‌ ఏజెంట్లనే లేకుండా చేస్తున్నారని అన్నారు. తాను తలచుకుంటే ఈరోజు ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నిలిపివేయగలిగేవాడినని జగన్ స్పష్టం చేశారు. తమ పార్టీ కార్యకర్తలు కూడా తిరగబడే పరిస్థితి రావచ్చొని, తాను అలా చేయట్లేదని అన్నారు జగన్. ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల ప్రక్రియను తానే గౌరవించకపోతే ప్రజలకు ఎలాంటి సందేశం ఇచ్చినట్లవుతుందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+