వైసీపీలో పదవులపై సజ్జల కామెంట్స్-ఆర్కేకు మంతి, మర్రికి ఎమ్మెల్సీ ఇవ్వలేకపోవడంపై..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నరేళ్లు కావస్తోంది. ఈ రెండున్నరేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని వందలాది మంది నేతలకు పదవులు దక్కాయి. అయితే ఇందులో గతంలో జగన్ హామీ ఇచ్చిన కొందరికి మాత్రం పదవులు దక్కలేదు. దీంోత వీరిపై ఇప్పుడు వైసీపీతో పాటు ఇతర పార్టీల్లోనూ చర్చ జరుగుతోంది. దీనిపై ఇవాళ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ కీలక నేత కూడా అయిన సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ నేత లోకేష్ పై విజయం సాధించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి ఇస్తానని అన్నాం కానీ వేరొక చోట ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే అదే జిల్లా చిలకలూరి పేటకు చెందిన వైసీపీ నేత మర్రి రాజశేఖర్ కు సేవలు అవసరం లేదని, గౌరవం ఇవ్వ లేదనటం సరికాదన్నారు. ఆరోజు ఆయా పరిస్థితులను బట్టి పదవులు ఇవ్వడంపై సీనియర్ నాయకులు తో మాట్లాడి సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకుంటున్నారు.

వైసీపీలో బీసీ, ఎస్సీ, మైనారిటీలకు పదవులు ఇస్తున్నట్లు సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ఇవాళ పదవి దక్కని వారికి ఖచ్చితంగా వేరొక రోజు న్యాయం జరుగుతుందని సజ్జల హామీ ఇచ్చారు. పార్టీ ప్రధానమని, పార్టీ ఓసారి ఇస్తే మాట తప్పదని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. వ్యక్తులకు సంబంధించి ఆయా పరిస్థితుల్లో పదవులు కేటాయించామన్నారు. టీడీపీలా ఓడిపోయే చోట సీట్లు ఇచ్చి నేతల్ని బలి చేయలేదని సజ్జల గుర్తుచేశారు. ఇచ్చిన మాట ప్రకారం మురుగుడు హనుమంతరావుకి ఎమ్మెల్సీ, కొనసాగింపులో భాగంగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కి ఎమ్మెల్సీ సీట్లు కేటాయించినట్లు సజ్జల వెల్లడించారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చే క్రమంలో, వచ్చాక చాలా మంది నేతలకు సీఎం జగన్ స్వయంగా పదవుల హామీలు ఇచ్చారు. వీరికి పదవులు దక్కకపోవడం, అదే సమయంలో కొత్తగా పార్టీలో చేరిన నేతలకు పదవులు లభిస్తుండటంతో వీరిలో ఆక్రోశం పెరుగుతోంది. దీనిపై స్పందించిన సజ్జల వారిని నేరుగా బుజ్జగించకుండా తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా ఊరడించినట్లయింది.