వరదల వేళ విజయవాడను భారీ ప్రమాదం నుండి రక్షించిన వైఎస్ జగన్!
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఈరోజు విజయవాడలోని కొన్ని ప్రాంతాల ప్రజలను వరద ముంపు నుంచి కాపాడింది . గత వైసిపి ప్రభుత్వ హయాంలో విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ జగన్ హయాంలో నిర్మించడం జరిగింది. నాడు జగన్ ముందుచూపుతో నిర్మించిన వాల్ కృష్ణ లంకతో పాటు కొన్ని ప్రాంతాల ప్రజలకు రక్షణా కవచంగా నిలిచింది.
కృష్ణా తీర ప్రాంత ప్రజలకు వరద ముంపు భయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో కృష్ణా నదికి వరద ఉధృతి పోటెత్తుతుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదికి రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజీ వద్ద అన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణానది తీర ప్రాంత ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

వరద ముంపు నుండి శాశ్వత పరిష్కారం చూపించిన జగన్
ఒకప్పుడు కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతున్న సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడి నుంచి తరలించి పునరావస కేంద్రాలకు చేర్చేవారు. మళ్లీ వరద ముంపు తగ్గిన తర్వాత తిరిగి వారి గృహాలకు చేరుకునేవారు అయితే వైసిపి ప్రభుత్వం తీసుకున్న చొరవతో కృష్ణలంక ప్రజలకు వరద ముంపు నుంచి శాశ్వత ఉపశమనం కలిగింది.
జగన్ హయాంలో కృష్ణా నది వెంట రిటైనింగ్ వాల్
కృష్ణా నది వెంబడి పద్మావతి ఘాట్ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ ను జగన్ సర్కార్ నిర్మించింది. మూడు అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతున 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మించడంతో కృష్ణలంకతో పాటు అనేక కాలనీల ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికింది.
విజయవాడ కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణా నది ప్రవాహాన్ని పరిశీలించిన మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ గారు.
— YSR Congress Party (@YSRCParty) September 2, 2024
మీరు సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే మా ప్రాణాలు నిలిచాయని వైఎస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపిన కృష్ణలంక వాసులు
రిటైనింగ్ వాల్ లేకపోతే పూర్తిగా… pic.twitter.com/ONDxPLiucq
జగన్ కు కృతజ్ఞతలు చెప్పిన కృష్ణ లంక వాసులు
భారీవర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి పెరిగినప్పటికీ కృష్ణలంక ప్రజలకు మాత్రం రిటైనింగ్ వాల్ రక్షణ కవచంగా నిలిచింది. దీంతో జగన్ సీఎంగా ఉన్న సమయంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తమ ప్రాణాలు నిలిచాయని వారు జగన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నేడు జగన్ పులివెందుల పర్యటన ముగించుకుని విజయవాడకు వచ్చిన క్రమంలో కృష్ణానది వద్ద కట్టిన రిటైనింగ్ వాల్ దగ్గర కృష్ణానది ప్రవాహాన్ని పరిశీలించారు.
80 వేల మందికి తప్పిన ముంపు బెడద
ఆ రిటైనింగ్ వాల్ వల్లనే తమ ప్రాణాలు నిలిచాయని కృష్ణలంక ప్రజలు జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. జగన్ తీసుకున్న చొరవతో కృష్ణలంక, రాణి గారి తోట, రామలింగేశ్వర నగర్, కోటి నగర్, పోలీస్ కాలనీ, రణ దివేనగర్, గౌతమి నగర్, చలసాని నగర్, నెహ్రూ నగర్, బాలాజీ నగర్, గీతా నగర్, ద్వారకా నగర్, భ్రమరాంబపురం, తారకరామానగర్ ప్రాంతాలు నీటి ముంపు నుంచి రక్షించబడ్డాయి. దాదాపు 80వేల మంది ప్రజలకు వరద ముంపు బాధ తప్పింది. దీంతో ప్రజలు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications