ద్రౌపదీ ముర్ముకు మద్దతు అందుకే- జగన్ కీలక వ్యాఖ్యలు-మంగళగిరిలో సన్మానం
రాష్ట్రపతి ఎన్నికల్లో ఈసారి ఎన్డీయే అభ్యర్ధిగా పోటీచేస్తున్న ద్రౌపదీ ముర్ము ఇవాళ ఏపీకి వచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఆమెను వైసీపీ తరఫున సీఎం జగన్, ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా ఆమెకు సీఎం జగన్ మరోసారి తన మద్దతు ప్రకటించారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు వైఎస్సార్‌సీపీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రపతి అభ్యర్థి ముర్మును గెలుపించుకోవాల్సిన అవసరం అందరికీ ఉందన్నారు . ఈ మేరకు మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళకు తొలిసారి అవకాశం లభించిందని, వైఎస్సార్‌సీపీ మొదటి నుంచి సామాజిక న్యాయం వైపే ఉందని జగన్ తెలిపారు. సామాజిక న్యాయాన్ని చేతల్లో చూపించిన ప్రభుత్వం మనదని జగన్ ఈ సందర్భంగా తెలిపారు. మనమంతా ముర్ముకే ఓటేసి గెలిపించుకోవాలని, ఏ ఒక్క ఓటు వృథా కాకుండా చూసుకోవాలని తమ పార్టీ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

అంతకుముందు ఏపీ టూర్ లో భాగంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ద్రౌపదీ ముర్ముకు ఘనస్వాగతం లభించింది. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల బృందం ఆమెను కలుసుకుని స్వాగతం పలికింది. ఈ తర్వాత నేరుగా ఆమె తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ సీఎం జగన్ , ఆయన భార్య వైఎస్ భారతి ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి జ్ఞాపిక అందజేశారు. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంపై ఆమెను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సీకే కన్వెన్షన్ హాల్ కు వెళ్లారు. అక్కడ కార్యక్రమం ముగిశాక ద్రౌపదీ ముర్ము తిరిగి వెళ్లిపోయారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ను ఆయన నివాసంలో కలుసుకున్న రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ము, కేంద్రమంత్రి కిషన్రెడ్డి. స్వాగతం పలికిన ముఖ్యమంత్రి దంపతులు. ద్రౌపదిముర్మును సత్కరించిన సీఎం. pic.twitter.com/YkVAzSjueC
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) July 12, 2022












Click it and Unblock the Notifications