జగన్ పాదయాత్ర,15 మంది టీడీపీలోకి జంప్?: 'రాముడు-రాక్షసుడు, నియంత అధ్యక్షుడైతే'
వైసీపీ అధినేత వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వైసీపీ రేపటి యాత్రకు సిద్ధమవుతోంది. మరోవైపు వైసీపీ మనోస్థైర్యాన్ని టీడీపీ తనవంతుగా పావులు కదుపుతోందని అంటున్
కడప: వైసీపీ అధినేత వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర సోమవారం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వైసీపీ రేపటి యాత్రకు సిద్ధమవుతోంది. మరోవైపు వైసీపీ మనోస్థైర్యాన్ని టీడీపీ తనవంతుగా పావులు కదుపుతోందని అంటున్నారు.
Recommended Video

చదవండి: పాదయాత్రకు ముందు జగన్‌కు కొత్త తలనొప్పి
జగన్ పాదయాత్ర రేపు ఇడుపులపాయలో ప్రారంభమవుతుంది. వైయస్‌కు నివాళులు, సర్వమత ప్రార్థనలు అనంతరం జగన్ మాట్లాడుతారు. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభిస్తారు. సోమవారం ఉదయం ఎనిమిదిన్నర గంటలకు వైయస్ ఘాట్ చేరుకుంటారు.
చదవండి: జగన్‌కు షాక్: టీడీపీలోకి ఇద్దరు కీలక నేతలు? రాజేశ్వరి తర్వాత జిల్లాలో వీరి మాటేమిటి?

తొలి రోజు జగన్ పాదయాత్ర
జగన్ తొలి రోజు 8.9 కిలో మీటర్ల పాదయాత్ర చేయనున్నారు. రాత్రి ఏడున్నర గంటలకు వేంపల్లి సమీపంలో తొలి రోజు ప్రజా సంకల్ప యాత్ర ముగుస్తుంది. అక్కడే భోజనం చేసి, నిద్ర చేస్తారు. ఇందుకోసం వైసీపీ అంతా సిద్ధం చేసింది.

ఇదీ లక్ష్యం, మార్పులు చేర్పులకు అవకాశం
జగన్ పాదయాత్ర 180 రోజులు, 125 నియోజకవర్గాలు, 10వేల వరకు గ్రామాలు, 3000 కిలోమీటర్లు సాగనుంది. 125 బహిరంగ సభలు, 2 కోట్ల మంది ప్రజలకు చేరువ ఈ పాదయాత్ర లక్ష్యం. ఇడుపులపాయ నుంచి ప్రారంభమయ్యే ఈ యాత్ర కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, మీదుగా శ్రీకాకుళంలోని ఇచ్ఛాపురం వరకు కొనసాగుతుంది. రోజుకు ఇరవై కిలోమీటర్లు లెక్కించి యాత్ర షెడ్యూల్‌ను రూపొందించారు. ఇదిలా ఉండగా యాత్ర కొనసాగుతుంటే మార్పులు, చేర్పులు ఉండే అవకాశాలున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అందుకే రూట్ మ్యాప్ విడుదల చేయలేదని అంటున్నారు.

బ్రేక్ ఎలా తీసుకోవాలి
అలాగే, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. దీంతో బ్రేక్ ఎలా తీసుకోవాలనే దానిపై జగన్ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినప్పటికీ, నేతలతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా పలు కారణాలతో రూట్ మ్యాప్ విడుదల చేయలేదని తెలుస్తోంది.

జగన్ పాదయాత్ర సమయంలో 15 మంది
ఓ వైపు జగన్ పాదయాత్ర కోసం వైసీపీ సిద్ధమవుతుండగా మరోవైపు మీడియాలో.. జగన్ పార్టీలో పాదయాత్రకు ముందు ఓ కలవరం ప్రారంభమైందని, దాదాపు పదిహేను మంది ముఖ్య నేతలు టీడీపీ గూటికి చేరే అవకాశముందని ప్రచారం సాగుతోంది. అందులో ప్రజాప్రతినిధులు, నేతలు ఉన్నట్లుగా చెబుతున్నారు.

నిజంగానే చేరుతున్నారా లేక ప్రచారమా?
శనివారం రంపచోడవరం ఎమ్మెల్యే హఠాత్తుగా టీడీపీలో చేరారు. జగన్ పాదయాత్ర కర్నూలుకు చేరుకోగానే మరో ఇద్దరు టీడీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం సాగుతోంది. దీంతో వారిని వైసీపీ బుజ్జగిస్తోందని అంటున్నారు. అయితే, పాదయాత్రకు కౌంటర్‌గా వైసిపీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు జరిగే ప్రచారమా లేక నిజంగానే చేరుతారా అనేది ముందు ముందు తేలనుంది.

బాబు రాముడు, జగన్ రాక్షసుడు
రాష్ట్రంలో శ్రీరామ రాజ్యాన్ని తలపించేలా సీఎం చంద్రబాబు పాలన సాగుతుంటే, జగన్ రాక్షసుడిలా పాదయాత్ర చేస్తున్నాడని శాసనమండలి సభ్యుడు బుద్దా వెంకన్న ఆదివారం విమర్శించారు. వచ్చే జనవరిలోపు వైసీపీ కనబడకుండా పోతుందని, 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష పార్టీ లేకుండా ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

ఒక నియంత అధ్యక్షుడైతే
అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టడానికి జగన్ పాదయాత్ర చేపడుతున్నారని బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. ఒక నియంత పార్టీ అధ్యక్షుడైతే ఎలా ఉంటుందో జగన్‌ని చూస్తే అర్థమవుతుందన్నారు. రాజకీయాల కోసం కుల, మత వివాదాలు సృష్టించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారన్నారు.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications