మోడీ, అమిత్ షా కోసం షర్మిల రాజకీయం
ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిన్న వైఎస్ జగన్ ను, వైసీపీని టార్గెట్ చేసి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీలో వైఎస్సార్ లేరని, వైఎస్సార్ పై పేటెంట్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని చెప్పారు వైఎస్ షర్మిల. ఇదే సమయంలో ఇప్పుడు చంద్రబాబు తల్లికి వందనం , గతంలో జగన్ అమ్మ ఒడి పథకంలో ప్రజలను మోసం చేశారన్నారు.
జగన్ పై షర్మిల వ్యాఖ్యలకు పేర్ని నాని కౌంటర్
జగన్ చెప్పిన అబద్దాలను తాను కూడా నమ్మి ప్రచారం చేశానని, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబును మోసకారి అంటూ వైసీపీ మీడియా రాయటం విడ్డూరం అన్నారు షర్మిల. వైఎస్ షర్మిల జగన్ ను, వైసీపీని టార్గెట్ చేసి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. అసలు షర్మిల ఎవరి కోసం రాజకీయం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు.

షర్మిల రాజకీయం ఎవరికోసం?
వైయస్‌ఆర్ కాంగ్రెస్, టీడీపీ, జనసేన, బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయాలు చేసే కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిల, ఆ పని కాకుండా అదే బీజేపీ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తూ, వారి చర్యలను సమర్థిస్తూ ప్రతిపక్షంలో ఉన్న పార్టీని విమర్శిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. అసలు షర్మిల ఎవరి కోసం రాజకీయాలు చేస్తున్నారని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆమె నిజానికి బీజేపీ, టీడీపీ కోసమే రాజకీయాలు చేస్తున్నారన్నారు.
అడిగిన వారి నుండి ఆన్సర్ లేదు .. షర్మిల కు ఎందుకు
మోడీ, అమిత్ షాల కోసం పని చేస్తున్నారన్నారు. తాము అడిగే ప్రశ్నలకు కూటమి నేతలు సమాధానం చెప్పాలి కానీ.. అందుకు భిన్నంగా షర్మిల సమాధానం చెబుతున్నారంటే రాజకీయాలు ఏ స్థాయికి దిగజారాయో అర్థం చేసుకోవాలని పేర్ని నాని పేర్కొన్నారు. చంద్రబాబు రాజకీయంలో షర్మిల పావుగా మారిందన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల గురించి తాము అడుగుతుంటే.. చంద్రబాబు సమాధానం చెప్పడం లేదని.. ఇప్పుడు షర్మిలను ఉసిగొల్పారన్నారు.
చంద్రబాబును కాపాడటం కోసమే షర్మిల కామెంట్స్
మరోవైపు క్షేత్ర పర్యటనలు, శ్వేతపత్రాల విడుదల పేరుతో తప్పుడు లెక్కలు, అసత్యాలు చెబుతున్నారని, ప్రజలను మభ్య పెట్టె ప్రయత్నం చేస్తున్నారని పేర్ని నాని గుర్తు చేశారు. చంద్రబాబు వైఖరి అలా ఉండగా, విమర్శల నుంచి ఆయనను కాపాడడం కోసమే, ఇప్పుడు షర్మిల ముందుకు వచ్చి మాట్లాడుతున్నట్లుగా ఉందని అన్నారు.
మేమలా అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పలేదు
అందుకే తమ పార్టీపై లేనిపోని విమర్శలు చేస్తున్నారని తెలిపారు. తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నామని, నాడు అమ్మ ఒడి పథకాన్ని కూడా చెప్పిన విధంగానే అమలు చేశామని స్పష్టం చేశారు. షర్మిల మాటల్లో వాస్తవం లేదన్నారు. అంతే తప్ప, ఇప్పుడు చంద్రబాబు మాదిరిగా ఎన్నికల ముందు ఒక మాట, పథకం అమలులో మరో మాట చెప్పలేదని పేర్ని నాని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications