నాకు అండగా, చీకటిలో వెలుగుగా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల రెడ్డి మధ్య జరుగుతున్న ప్రచ్చన్న సమరం రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిని కలిగిస్తుంది. వైఎస్ షర్మిల, వైయస్ జగన్ తమ ఫ్యామిలీకి సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో వీరిద్దరి మధ్య జరుగుతున్న పోరులో భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.
యూఎస్ వెళ్ళిన విజయమ్మ
అన్నాచెల్లెళ్ల మధ్య జరుగుతున్న ప్రచ్చన్న సమరం నేపథ్యంలో వైఎస్ విజయమ్మ ఇద్దరికీ చెప్పలేక యూఎస్ బాట పట్టిన విషయం తెలిసిందే. కరవమంటే కప్పకు కోపం విడవమంటే పాముకు కోపం అన్న చందంగా తయారైన అన్నా చెల్లెళ్లకు దూరంగా, ఎన్నికల ప్రచారాలకు దూరంగా వైఎస్ విజయమ్మ అమెరికా వెళ్లారు. వైయస్ విజయమ్మ మద్దతు తమకంటే తమకుందని అన్నా చెల్లెలు ఇద్దరు పోటీపడి మరి జనాలకు చూపించే ప్రయత్నం చేశారు .

విజయమ్మ పుట్టినరోజున షర్మిల పోస్ట్
ఇక తాజాగా మరో మారు వైఎస్ విజయమ్మను ఉద్దేశించి వైయస్ షర్మిల ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈరోజు వైయస్ విజయమ్మ పుట్టినరోజు సందర్భంగా అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు అంటూ పోస్ట్ పెట్టిన వైఎస్ షర్మిల నాకు జన్మనిచ్చి, ఆ జన్మకు సార్ధకత చేకూర్చుకోవడానికి అండగా ఉన్నావు అంటూ తల్లిని కొనియాడారు.
విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపము నువ్వు
చీకటిలో వెలుగుగా, వేదనలో సాంత్వనగా, విలువలను, విశ్వాసాన్ని నింపిన నిస్వార్థ రూపము నువ్వు అంటూ తల్లి విజయమ్మ తమకు అండగా ఉన్న కొండంత ధైర్యం అన్నారు. నీకు ఆ దేవుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలను, మనశ్శాంతిని, ఆనందాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తూ హ్యాపీ బర్త్డే మా అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.
ఎన్నికల వేళ విజయమ్మ కోసం ఆసక్తికర పోస్ట్
విజయమ్మ పుట్టినరోజున వైఎస్ షర్మిల పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైఎస్ షర్మిలకు విజయమ్మ అంటే ఎనలేని ప్రేమ, ఇదే సమయంలో విజయమ్మకు వైఎస్ షర్మిల అంటే ఎనలేని ప్రేమ అని ఈ పోస్టు ద్వారా కాంగ్రెస్ నాయకులు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications