Kadambari Jethwani-YS Sharmila: కాదంబరీ జెత్వానీకి అండగా షర్మిల-మరో పోరాటానికి రెడీ..!
కడప స్టీల్ ప్లాంట్ కట్టించడం చేతకానీ మాజీ సీఎం జగన్, సజ్జన్ జిందాల్... ముంబై నటి కాదంబరీ జెత్వానీపై వేధింపులకు దిగడాన్ని పీసీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల(YS Sharmila) తీవ్రంగా తప్పుబట్టారు. కడప స్టీల్ ప్లాంట్ వైఎస్సార్ ఆశయమని ఆమె గుర్తుచేశారు. ఈ ప్లాంట్ పై ముఖ్యమంత్రులు ఎవరికీ చిత్తశుద్ధి లేదన్నారు. ఇవాళ కడప కలెక్టర్ ను కలిసి స్టీల్ ప్లాంట్ నిర్మాణంపై తక్షణ చర్యలు చేపట్టాలని ఆమె వినతిపత్రం ఇచ్చారు.
జిందాల్ కంపెనీ కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని షర్మిల ఆరోపించారు. పైగా పదే పదే తాడేపల్లి ప్యాలెస్ లో సజ్జన్ జిందాల్ కలుస్తుంటే కడప స్టీల్ వేగవంతం చేస్తున్నారు అనుకున్నారన్నారు. కానీ ఒక మహిళా కాదంబరి విషయం బయట పడే సరికి ఇందుకా.. అని ఆశ్చర్య పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఒక మహిళను కట్టడి చేసేందుకు స్కీమ్ లు వేశారని అర్థం అయిందన్నారు. ఇది మామూలు మాస్టర్ ప్లాన్ కాదన్నారు. ఆడదాన్ని ఒక్క దాన్ని చేసి తొక్కాలని చూశారని షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

జె అండ్ జె ఇద్దరు కలిసి బుర్రలు పెట్టి జె స్వేర్ గా కార్యాచరణ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. మీ బుర్రలు కడప స్టీల్ మీద పెట్టి ఉంటే ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తి అయ్యేదన్నారు. జగన్, తానూ మంచి దోస్త్ లు అని సజ్జన్ జిందాల్ గతంలోనే చెప్పారని షర్మిల గుర్తుచేశారు. ముంబై నటి కాదంబరి జెత్వానీ (Kadambari Jethwani)ఒక డాక్టర్ అని, ఆమె ఒక నటి అని, ఆమెది గొప్ప కుటుంబమని షర్మిల తెలిపారు. ఆమె ఒక కేసు పెడితే తొక్కాలని చూశారని ఆరోపించారు. నిజంగా కాదంబరి మోసం చేయాలని చూస్తే జిందాల్ ఒక 50నో 100 కోట్లు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోనే వాడు కదా అన్నారు.
ఆమె న్యాయం కావాలని నిలబడిందని, అందుకే కట్డడి చేసేందుకు ఐపీఎస్ లను ఉపయోగించారని జగన్ పై ఆరోపణలు గుప్పించారు. ఇది దారుణ చర్యని, నన్నే కలిసి మద్దతు కావాలని అడిగీతే నేను పోరాటం చేస్తానని కాదంబరికి షర్మిల హామీ ఇచ్చారు. సజ్జన్ జిందాల్ కోసం జగన్ ఇంత దారుణంగా దిగజారుతాడా అని నిలదీశారు. తనకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారని జగన్ చెప్పాడని, కేవలం ఫోర్జరీ సంతకం కోసం ఇంతమంది ఉన్నతాధికారులు ఆమె వెనక పడతారా అని ప్రశ్నించారు. దీని మీద విచారణ వేగంగా జరగాలన్నారు. జగన్ కూడా సమాధానం చెప్పాలన్నారు.












Click it and Unblock the Notifications