YS Viveka murder.. షాకింగ్ వీడియోలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
గత ఎన్నికలకు ముందు జరిగిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఐదేళ్లుగా తను న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని వివేకానంద రెడ్డి కుమార్తె సునీత పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు చేయాల్సింది ఇంకా చాలా ఉందని పేర్కొన్న సునీత హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివేకానంద రెడ్డి హత్య కేసు పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు.
వివేకా హత్య దృశ్యాలు .. గుండెపోటు అనుకుంటారా?
ఈ కేసులో సిబిఐపై ఒత్తిడి ఉందని వివేకానంద రెడ్డి హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరో త్వరలోనే బయటకు రావాలని కోరుకుంటున్నానని ఆమె తెలిపారు. వివేకానంద రెడ్డి హత్య నాటి దృశ్యాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో చూపించిన సునీత, ఈ దృశ్యాలను చూస్తే ఎవరైనా వివేకానంద రెడ్డికి గుండెపోటు అని అనుకుంటారా అంటూ ప్రశ్నించారు.

హత్యరోజు కాల్ డేటాతో పాటు ఆ వివరాలు వెల్లడి
హత్య జరిగిన రోజు రాత్రి, ఆ తర్వాత రోజు ఉదయం కాల్ డేటాతో పాటు గూగుల్ టేకవుట్, ఐపిడీఆర్ డేటాను కూడా సునీత వెల్లడించారు. ఈ సమయంలో ఎంపీ అవినాష్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు. వివేకానంద రెడ్డి హత్య కేసులో నలుగురు నిందితులను సిబీఐ మొదట చార్జిషీట్లో చేర్చారని ఏ1 ఎర్ర గంగిరెడ్డి, ఏ2 సునీల్ యాదవ్ , ఏ3 ఉమాశంకర్ రెడ్డి, ఏ4 దస్తగిరి అని పేర్కొన్నారు.
అవినాష్ కు హత్యకేసు నిందితులతో సంబంధం
ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి, ఏ3 నిందితుడు ఉమా శంకర్ తో అవినాష్ రెడ్డికి పరిచయం ఉందని, అవినాష్ తో పాటు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డితో మరో నిందితుడు సునీల్ యాదవ్ తమ్ముడు కిరణ్ యాదవ్ ఉన్న ఫోటోలను కూడా ఆమె చూపించారు. ఉమా శంకర్ రెడ్డి కి అవినాష్ నుంచి వచ్చిన ఫోన్ కాల్స్ డేటాను కూడా సునీత బయటపెట్టారు.

అవినాష్ ను పట్టించుకోని వివేకా.. వీడియో
వివేకానంద రెడ్డి ఇంటి సమీపంలో ఉమాశంకర్ రెడ్డి పరిగెడుతున్న దృశ్యాలు, హత్య జరిగిన తర్వాత అన్ని మీడియా ఛానల్స్ లో వచ్చిన వార్తలు క్లిప్పింగులు, వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పేర్కొన్నారు. హత్య జరగడానికి ముందు కొద్ది రోజుల క్రితం ఓ సభలో వేదికపై అవినాష్ ఏతో చెబుతున్నా పట్టించుకోకుండా వివేకానంద రెడ్డి వెళ్ళిపోతున్న దృశ్యాలను సునీత ప్రదర్శించారు.
అవినాష్ కు అన్నీ తెలుసు
ఇక ఎం వి కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డికి చాలా సన్నిహితుడని, శివశంకర్ రెడ్డి ఆయనకు మధ్య ఫోన్ కాల్స్ ఉన్నాయని, కానీ అవినాష్ మాత్రం వాళ్ళు ఎవరో తనకు తెలియదని చెబుతున్నాడన్నారు. అప్పట్లో వైయస్ వివేకానంద రెడ్డి పేరు ఓటరు జాబితా నుంచి తీసి వేశారన్నారు. వైయస్ షర్మిలకు ఎంపీ సీటు ఇవ్వాలని జగన్ ను వివేకా అడిగారని, ఈ క్రమంలోనే ఆయన పేరు ఓటర్ జాబితా నుంచి తొలగించబడిందని తెలిపారు. వివేక హత్యకు సంబంధించి అనేక కీలక విషయాలను ఆయన కుమార్తె సునీత వెల్లడించారు.












Click it and Unblock the Notifications