వైసీపీ ఫైనల్ లిస్ట్, మ్యానిఫెస్టో రెడీ-ఇడుపులపాయలో రిలీజ్-ఇచ్చాఫురం నుంచి జగన్ ప్రచారం..!
ఏపీలో వైసీపీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు అన్ని అస్త్రాలు సిద్దం చేసుకుంటున్న సీఎం వైఎస్ జగన్ ఈ నెల 16న కీలక ముహుర్తం సిద్దం చేసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని దాదాపు 90 అసెంబ్లీ సీట్లతో పాటు పలు ఎంపీ సీట్లలో ఇన్ ఛార్జ్ లను మార్చేసిన జగన్.. ఇప్పుడు తుది జాబితా విడుదలకు ముహుర్తం రెడీ చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ వేదికగా ఈ నెల 16న వైసీపీ అభ్యర్ధుల తుది జాబితాను జగన్ రిలీజ్ చేస్తారు.
అదే రోజు ఇడుపుల పాయలో వైసీపీ మ్యానిఫెస్టోను కూడా విడుదల చేసేందుకు సీఎం జగన్ సిద్దమవుతున్నారు. ఇప్పటికే అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే.. మరిన్ని ప్రజాకర్షక పథకాలను అమలు చేసేందుకు వీలుగా జగన్ మ్యానిఫెస్టోకు తుది మెరుగులు దిద్దుతున్నారు. ఇందులో పింఛన్ల పెంపు, డ్వాక్రా రుణమాఫీ, మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పలు అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 16న ఇడుపులపాయలోనే దీన్ని విడుదల చేస్తారు.

అదే రోజు ఇడుపుల పాయ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురానికి జగన్ పయనం కానున్నారు. గతంలో తాను చేసిన పాదయాత్రను ఇచ్ఛాపురంలోనే ముగించిన జగన్.. ఇప్పుడు తిరిగి అక్కడి నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. రెండు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అంచనా వేస్తున్న జగన్.. ఆ తర్వాతే ఈ కార్యక్రమాలన్నీ ప్లాన్ చేసుకున్నారు. దీంతో నోటిఫికేషన్ రాగానే జగన్ ఎన్నికల సమరంలోకి దిగబోతున్నారు.












Click it and Unblock the Notifications