Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రోడ్లపై జనసేన రచ్చకు వైసీపీ కౌంటర్- బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్తుడూ..రోడ్లు బాగున్నాయ్..

ఏపీలో రోడ్ల దుస్ధితిపై రెండేళ్లుగా వివిధ రూపాల్లో పోరాటం చేస్తున్న జనసేన.. తాజాగా గుడ్ మార్నింగ్ సీఎం సర్ అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తోంది. అసలే వర్షాలతో అధ్వాన్నంగా తయారైన రోడ్లను ఫొటోలు తీసి సోషల్ మీడియాను నింపేస్తోంది. దీంతో ఈ ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ దీనికి కౌంటర్ దాడి మొదలుపెట్టేసింది. గుడ్ మార్నింగ్ సీఎం సర్ కు కౌంటర్ గా బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడంటూ అదే సోషల్ మీడియాలో ఫొటోలు పోస్ట్ చేస్తోంది.

గుడ్ మార్నింగ్ సీఎం సర్

గుడ్ మార్నింగ్ సీఎం సర్

ఏపీలో నానాటికీ అధ్వాన్నంగా తయారవుతున్న రోడ్లను బాగుచేసేందుకు సీఎం జగన్ వరుసగా ఆదేశాలు ఇచ్చినా ఫలితం మాత్రం కనిపించడం లేదు. అదే సమయంలో ఏపీలో సమస్యలపై పోరాటం కోసం ఎదురుచూస్తున్న జనసేనకు ఇది వరంగా మారింది. దీంతో రోడ్లపై గతంలో ఓసారి నిర్వహించిన క్యాంపెయిన్ కు దీటుగా ఈసారి గుడ్ మార్నింగ్ సీఎం అంటూ మరో ప్రచారం మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ పాడైపోయిన రోడ్లను ఫొటోలు తీస్తూ గుడ్ మార్నింగ్ సీఎం సర్ అంటూ ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తోంది.

బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడు

బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడు


జనసేన రోడ్లపై చేస్తున్న గుడ్ మార్నింగ్ సీఎం సర్ ప్రచారానికి దీటుగా వైసీపీ కూడా ఇప్పుడు కౌంటర్ దాడికి దిగింది. ఇందులో భాగంగా బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడూ.. రోడ్లు బాగున్నాయ్ అంటూ కౌంటర్ అటాక్ కు దిగుతోంది. గుడ్ మార్నింగ్ కు దీటుగా వైసీపీ బ్యాడ్ మార్నింగ్ ప్రచారం మొదలుపెట్టడంతో జనసేనకు కౌంటర్లు పడుతున్నాయి. జనసేన నేతలు పెట్టిన ఫొటోలకు కౌంటర్ గా బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడు పేరుతో వైసీపీ పెడుతున్న ఫొటోలు కూడా ఇప్పుడు ఆకర్షిస్తున్నాయి. దీంతో వైసీపీ వర్సెస్ జనసేన వార్ మరింత ముదిరేలా కనిపిస్తోంది.

 వైసీపీ కౌంటర్ అటాక్ ఇలా..

వైసీపీ కౌంటర్ అటాక్ ఇలా..


జనసేన నేతలు గుడ్ మార్నింగ్ సీఎం సర్ పేరుతో పెడుతున్న ఫొటోల్లో రాష్ట్రవ్యాప్తంగా అధ్వాన్నంగా మారిన ఫొటోలు పెడుతుంటే వైసీపీ నేతలు మాత్రం రాష్ట్రంలో అద్భుతంగా వేసిన రోడ్ల దగ్గర ఫొటోలు దిగి బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్తుడంటూ వాటిని ట్యాగ్ చేస్తున్నారు. అలాగే ఎక్కడెక్కడో సేకరించిన ఫొటోల్ని ఇదే ట్యాగ్ లైన్ తో షేర్ చేస్తున్నారు. మరికొందరు వైసీపీ నేతలైతే జనసేన నేతలు పెట్టిన ఫొటోలకు వీటిని రీట్వీట్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో ఈ రోడ్ల రచ్చ ఓ రేంజ్ లో సాగుతోంది.

వార్ ముదిరితే ఎవరికి నష్టం ?

వార్ ముదిరితే ఎవరికి నష్టం ?

అయితే సోషల్ మీడియాలో గుడ్ మార్నింగ్ సీఎం సర్ పేరుతో జనసేన మొదలుపెట్టిన ప్రచారానికి కౌంటర్ గా వైసీపీ బ్యాడ్ మార్నింగ్ దత్తపుత్రుడంటూ కౌంటర్ మొదలుపెట్టడం బాగానే ఉంది. కానీ ఈ ప్రచారం ఎక్కువయ్యే కొద్దీ జనం తమ ప్రాంతాల్లో రోడ్లపై చర్చించుకోవడం మొదలుపెడతారు. అసలే ఇది వర్షాకాలం. ప్రభుత్వం వేయాలనుకున్నా రోడ్లను వేసే పరిస్ధితి లేదు. అలాంటప్పుడు స్ధానికంగా జనం తమ రోడ్లను ఈ ట్వీట్లకు లింక్ చేసి చూసుకుంటే మాత్రం వైసీపీ ప్రభుత్వానికే ఇబ్బందులు తప్పవు. అదే సమయంలో జనసేనకూ మైలేజ్ పెరగడం ఖాయం. కాబట్టి వైసీపీ నేతలు ఆచితూచి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+