ప్రత్యేకహోదా: రైలురోకోలు చేపట్టిన వైసీపీ, పలువురి అరెస్ట్, ఉద్రిక్తత

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రత్యేక హోదా కోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో బుధవారం నాడు రైలు రోకోలు నిర్వహించారు. పలు చోట్ల ఈ ఆందోళనలతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ప్రత్యేక హోదాకోసం న్యూడిల్లో వైసీపీ ఎంపీలు ఆమరణ దీక్ఖలకు దిగారు.ఈ దీక్షలకు సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా రైలురోకోలు నిర్వహించాలని వైసీపీ పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రైలు రోకోలు నిర్వహించారు.

Ysrcp leaders conducts Rail roko for special status to Ap state

కడప రైల్వేస్టేషన్ వద్ద పోలీసులకు , వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వావాదం చోటు చేసుకొంది. ఎమ్మెల్యేలను మాత్రమే రైల్వేస్టేషన్ ‌లోకి అనుమతి ఇస్తామని పోలీసుల ప్రకటించారు. దీంతో వైసీపీ కార్యకర్తలు, నేతలు కడప రైల్వే స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. నెల్లూరు జిల్లాలో రైలు రోకోకు దిగిన ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.తిరుపతిలో వైసీపీ నేత భూమన కరుణ్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నేతలు రైలు రోకో నిర్వహించారు.

గుంటూరులో రైలురోకి నిర్వహిస్తున్న వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రైలు రోకోలు నిర్వహించిన వైసీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు.రాజమండ్రిలో కూడ వైసీపీ శ్రేణులు రైలురోకోలో పాల్గొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Ysrcp leaders conducted rail roko for special status to Ap state on Wednesday.several ysrcp leaders arrested for conducting rail roko.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X