Allu Arjun: అల్లు అర్జున్ కు శిల్పారవి థ్యాంక్స్..! మద్దతుపై బన్నీ క్లారిటీ..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియబోతున్న వేళ వైసీపీ నుంచి నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్ధిగా నిలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పారవిచంద్రారెడ్డికి మద్దతుగా ఇవాళ టాలీవుడ్ హీరో అల్లుఅర్జున్ ప్రచారం నిర్వహించారు. ఇవాళ కుటుంబ సమేతంగా నంద్యాల వచ్చిన బన్నీ.. తన స్నేహితుడు శిల్పారవికి ఓటేయాలని ఓటర్లను కోరారు. దీంతో శిల్పా అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం శిల్పారవి కూడా స్పందించారు.

తన మిత్రుడు, శ్రేయోభిలాషి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సతీ సమేతంగా నంద్యాల విచ్చేసి రానున్న ఎన్నికలకు శుభాకాంక్షలు తెలిపినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు! అంటూ ఎక్స్ లో శిల్పా రవి పోస్టు పెట్టారు. దీనికి తన ఇంటికి వచ్చిన అల్లుఅర్జున్ అభిమానులకు అభివాదం చేస్తున్న వీడియోను కూడా జత చేశారు. దీంతో అభిమానులు ఈ వీడియోను వైరల్ చేస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అభ్యర్ధి అని తెలిసినా బన్నీ మద్దతు పలకడంపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో బన్నీ కూడా తన మద్దతుపై క్లారిటీ ఇచ్చారు.

ysrcp mla candidate Shilpa ravi thanks to allu arjun support here is bunny s reaction

నంద్యాలలో పోటీ చేస్తున్న తన ఫ్రెండ్ శిల్పారవి చంద్రారెడ్డికి మద్దతు పలకడంపై వస్తున్న విమర్శలపై బన్నీ స్పందించారు. నంద్యాల నుంచి తిరుగు ప్రయాణం అవుతూ మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్.. శిల్పారవికి వ్యక్తిగతంగా స్నేహితుడు కావడంతో మద్దతు పలికినట్లు తెలిపాడు. అంతకు మించి ఏ రాజకీయ పార్టీకి కూడా తాను మద్దతు పలకడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. జనసేన ఆగ్రహం నేపథ్యంలో బన్నీ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+