కోస్తాప్రజల వల్లే హైదరాబాద్ అభివృద్ధి; కేటీఆర్ కు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కౌంటర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందిందని చెబుతూ పక్క రాష్ట్రంలోని పరిస్థితులను గురించి షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ బెస్ట్ సిటీ అని చెబుతూనే పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు కూడా సరిగా లేవని మిత్రుడు చెప్పారని పేర్కొన్నారు. పక్క రాష్ట్రంలో రోడ్లన్నీ ధ్వంసమై ఉన్నాయంటూ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. పక్క రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగానూ అన్యాయంగానూ ఉందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యే మల్లాది విష్ణు రివర్స్ కౌంటర్ ఇచ్చారు.

మంత్రి కేటీఆర్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన మల్లాది విష్ణు

మంత్రి కేటీఆర్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చిన మల్లాది విష్ణు

మంత్రి కేటీఆర్ ఎక్కడా ఆంధ్రప్రదేశ్ అని పేరు వాడకుండా పక్క రాష్ట్రంలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని పేర్కొన్నప్పటికీ కెసిఆర్ మాట్లాడింది ఆంధ్ర ప్రదేశ్ గురించేనని భావించిన వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మంత్రి కేటీఆర్ కు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కెసిఆర్ లాగే కేటీఆర్ కూడా పిట్టకథలు చెబుతున్నారని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గురించి మాట్లాడే హక్కు టిఆర్ఎస్ పార్టీ నేతలకు లేదని ఆయన మండిపడ్డారు.

కోస్తా ప్రజల వల్లే హైదరాబాద్ అభివృద్ధి

కోస్తా ప్రజల వల్లే హైదరాబాద్ అభివృద్ధి

కోస్తా ప్రజల వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు వ్యాఖ్యానించారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాలు విడిపోక ముందు నుండే అభివృద్ధి చెందిన ప్రాంతంగా మారిన హైదరాబాద్ గురించి ఇప్పుడు టిఆర్ఎస్ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారు అంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో నీళ్ళు, కరెంటు, రోడ్లు ఉన్నాయో లేదో అక్కడ కూర్చుని మాట్లాడితే ఏం అర్థమవుతుంది.. విజయవాడకు వచ్చి చూస్తే అర్థమవుతుందని సెటైర్లు వేశారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన లో అన్ని రంగాల ప్రజలు సంతోషంగా ఉన్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు.

తెలంగాణాకు కల్చర్ నేర్పింది ఏపీ ప్రజలు

తెలంగాణాకు కల్చర్ నేర్పింది ఏపీ ప్రజలు

కోస్తాంధ్ర ప్రజలు తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి హైదరాబాద్ లో ఉన్నారు కాబట్టే అక్కడ అభివృద్ధి జరిగిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలంగాణకు కల్చర్ నేర్పింది ఏపీ ప్రజలు అన్నారు మల్లాది విష్ణు. అంతేకాదు ఏపీ ప్రజలు అక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టినందువల్లే ఆ రాష్ట్రం అభివృద్ధి చెందిందని, అయితే కొంతమంది రెండు కళ్ల సిద్ధాంతం వల్ల రాష్ట్రాన్ని విడగొట్టాల్సి వచ్చిందని మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇక తమ ప్రభుత్వానికి వచ్చిన అవార్డులు తెలంగాణ ప్రభుత్వానికి వచ్చాయా అంటూ ప్రశ్నించిన ఆయన కేటీఆర్ హైదరాబాదును చూసి మురిసిపోతున్నారు అని అది సరైన పద్ధతి కాదంటూ చురకలంటించారు.

కేటీఆర్ కు మల్లాది విష్ణు హెచ్చరిక

కేటీఆర్ కు మల్లాది విష్ణు హెచ్చరిక


ఇలాగే మాట్లాడితే మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అన్న విషయాన్ని కేటీఆర్ గుర్తు పెట్టుకోవాలని మల్లాది విష్ణు హెచ్చరించారు.వివిధ సంక్షేమ పథకాల అమలులో ఏపీ ముందువరుసలో ఉందని నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందుతున్నాయని వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. పథకాల విషయంలో అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్న మల్లాది విష్ణు, కావాలని ఎలా ఏపీ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారంటూ మండిపడ్డారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలు సంతోషం గా ఉన్నారని చెప్పారు.

దుష్ప్రచారం నమ్మొద్దు

దుష్ప్రచారం నమ్మొద్దు


ఎల్లో మీడియా ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వక్రీకరిస్తుందని మల్లాది విష్ణు మండిపడ్డారు. రాష్ట్రంలో మహిళల రక్షణ గురించి మాట్లాడే అధికారం టిడిపి నేతలకు లేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు.తెలుగుదేశం పార్టీ హయాంలో మహిళలను చిన్నచూపు చూశారని పేర్కొన్న మల్లాది విష్ణు, తమ ప్రభుత్వం పై ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+