మంత్రి జోగి రమేష్ పై మళ్లీ రెచ్చిపోయిన ఎమ్మెల్యే వసంత-చడ్డీ గ్యాంగ్, బెల్ట్ బ్యాచ్,తొట్టి గ్యాంగ్..

మైలవరం నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ సీఎం జగన్ స్వయంగా కేబినెట్ భేటీలోనే హెచ్చరించినా మంత్రి జోగి రమేష్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

మైలవరం : ఎన్టీఆర్ జిల్లా జిల్లా మైలవరం నియోజకవర్గంలో వైసీపీ గ్రూపుల పోరు మరోసారి బజారున పడింది. జి.కొండూరు మండలంలోని వెల్లటూరు గ్రామంలో ఎం.పీ.ఎఫ్.సీ గోడౌన్,కేడీసీసీ బ్యాంక్ భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ( vasantha krishnaprasad) మరోసారి పార్టీలోని తన ప్రత్యర్ధులపై హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యంగా మంత్రి జోగి రమేష్ ను టార్గెట్ చేస్తూ వసంత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.

మైలవరం వైసీపీలో కొంతకాలంగా నెలకొన్న వర్గపోరు మరోసారి బయటపడింది. స్ధానికంగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన స్ధానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. తన ప్రత్యర్ధి, మంత్రి జోగి రమేష్ పై తీవ్ర విమర్శలకు దిగారు. ఈ సందర్భంగా జోగి వర్గంపై మరోసారి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో స్వపక్షంలోనే విపక్షాలు తయారయ్యాయంటూ వసంత విమర్శించారు. చడ్డీ గ్యాంగ్, బెల్ట్ బ్యాచ్,తొట్టి గ్యాంగ్ లు తయారయ్యాయన్నారు.

ysrcp mla vasantha krishna prasad fire on minsiter jogi ramesh group again- hot comments

విపక్షాలకు మనల్ని విమర్శించే దైర్యం లేదని, కోతి మూకలు సొంత పార్టీలో చేసే చర్యల్ని పట్టించుకోవద్దని వైసీపీ శ్రేణుల్ని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ సూచించారు. అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మరోవైపు ఇదే కార్యక్రమంలో పాల్గొన్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు కూడా వసంతకు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేశారు.ఓటమి ఎరుగని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు ని 12వేల ఓట్ల మెజారిటీతో ఓడించిన ఘనత వసంత కృష్ణ ప్రసాదు కి ఉందన్నారు. పక్క నియోజకవర్గాల జోలికి ఎమ్మెల్యే వెళ్ళరు,తన పనేదో తానే చూసుకుంటారన్నారు. అవసరమైతే స్వంత డబ్బులు ఖర్చు పెడతారని, వైయస్ రాజశేఖరరెడ్డి సమయంనుండి ఆయనతో నడుస్తూ నందిగామ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారని ప్రశంసించారు. అలాగే మరో మారు జగనన్న ఆశీస్సులతో మళ్ళీ మైలవరంలో పోటీ చేస్తారని, మీ చల్లని దీవెనలు అందించండని పార్టీ శ్రేణుల్ని కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+