జగన్ సొంత జిల్లాలో వైసీపీ ఎమ్మెల్సీ కాల్ డేటా లీక్-సర్కార్ సీరియస్-ఇద్దరు కానిస్టేబుళ్లు అవుట్
వైసీపీ తరఫున తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన కడప జిల్లా నేత రమేష్ యాదవ్ కలకలం రేపుతున్నారు. ఎమ్మెల్సీగా ఎంపిక కాగానే ఆయనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఆయన కాల్ డేటా లీక్ అయి ప్రైవేటు వ్యక్తులకు చేరింది. దీంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది.
కడప జిల్లా నుంచి తాజాగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అయిన రమేష్ యాదవ్ కాల్ డేటా లీకేజ్ వ్యవహారం కలకలం రేపుతోంది. సీఎం జగన్ సొంత జిల్లా కావడం, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కావడంతో ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కాల్ డేటా ప్రైవేటు వ్యక్తులకు ఎలా చేరిందనే వ్యవహారంపై ఆరా తీశారు. చివరికి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ కడప ఎస్పీ ఆదేశాలు ఇచ్చారు.

వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కాల్ డేటా లీకేజ్ వ్యవహారంలో ఇద్దరు కానిస్టేబుళ్లు సుబ్బారెడ్డి, శ్రినివాసులరెడ్డిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ తాజాగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి పాత్ర ఉందనే అంశం కలకలం రేపుతోంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ కాల్ డేటాకే భద్రత లేకపోతే ఇక సామాన్యుల పరిస్దితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో ఈ కేసులో నిజానిజాలు వెలికి తీసేందుకు పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.












Click it and Unblock the Notifications