అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్, సాయిరెడ్డిపై సోషల్ వార్-టీడీపీ సోషల్ మీడియాపై సీఐడీ, సీఎంవోకు ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ వార్ మరింత ముదురుతోంది. ఇందులో భాగంగా బహిరంగంగా చేసుకునే విమర్శల కంటే మరింత పదునుగా సోషల్ మీడియా పోస్టులు పెట్టుకోవడం, అందులోనూ బూతులతో రెచ్చిపోవడం సర్వసాధారణంగా మారింది. ఇదే క్రమంలో తనపై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్టులు పెడుతున్నారంటూ టీడీపీ సోషల్ మీడియా విభాగంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదులు చేశారు.

టీడీపీ సోషల్ మీడియాపై సీఐడీ, సీఎంఓ, అధికారులకు విజయ సాయి రెడ్డి ఫిర్యాదు చేశారు.ఇందులో టీడీపీ సోషల్ మీడియా వింగ్ కుచెందిన 20 మంది పేర్లను ప్రస్తావించారు. వీరు నిరంతరం తనతో పాటు సీఎం జగన్ పై అనుచితంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు సాయిరెడ్డి ఆరోపించారు. దీంతో ఇప్పుడు సీఎంవో, సీఐడీ ఎలాంటి చర్యలకు దిగబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది.

ysrcp mp vijaya sai reddy complained cid, cmo against tdp social media team, youtubers

విజయసాయిరెడ్డి సీఎంవోతో పాటు సీఐడీకి చేసిన ఫిర్యాదులో మొత్తం 20మంది పేర్లు ప్రస్తావించారు.

1.అనిత (విశాఖపట్నం)
2.మాలతి రెడ్డి ( విజయవాడ)
3.హర్షిత (హైదరాబాద్)
4.కిరణ్ కుమార్ కింతలి
5.జెట్టి రేణుక (తెనాలి)
6.బాలనదం (విజయవాడ)
7.కొల్లి విజయ్ (రాజమండ్రి)
8.వేమూరి అశ్వినీ (ఒంగోలు)
9.బెల్లంకొండ సురేష్ (గుంటూరు)
10.షైక్ తజుద్దీన్ (విజయవాడ)
11.పవన్ కుమార్ (హిoదుపురం)
12.మురళీకృష్ణా (నెల్లూరు)
13.అoజీ చౌదరి (భద్రాచలం)
14.సత్యం రెడ్డి (నెల్లూరు)
15.సందీప్ కుమార్ (విశాఖ)
16.బసి రమణ రెడ్డి (కాకినాడ)
17.అడపా నరేష్ (విశాఖ)
18.శ్రావణ్ కుమార్ నాయుడు (కుప్పం )
19.షైక్ మీరా మోహిదీన్ (నెల్లూరు)
20.వెంకట్ రెడ్డి (కడప)

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు, నాపై తప్పుడు వీడియోలు, గ్రాఫిక్స్ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్లు గుర్తించామని వారిపై చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదుల్లో విజయసాయిరెడ్డి కోరారు.
అలాగే రాష్ట్రంలో కొన్ని యూట్యూబ్ చానల్స్ పై కూడా ఆయన ఫిర్యాదు చేశారు. వీటిలోనూ తమపై అనుచిత కంటెంట్ పెడుతున్నట్లు తెలిపారు.

English summary
ysrcp mp vijaya sai reddy has lodged two separate complaints against tdp social media team for deregatory posts on him and cm ys jagan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X