సోనూ సూద్‌కు చంద్రబాబు గాలం-ఇమేజ్ పెంచుకోవడానికి సాయిరెడ్డి సలహా
టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై నిత్యం ఏదో ఒక అంశంలో ట్వీట్లు పెడుతూ సంచలనాలు రేపుతున్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఇవాళ మరో విషయంలో విమర్శలకు దిగారు. అంతే కాదు చంద్రబాబును ఉద్దేశించి పెట్టిన ట్వీట్‌లో ఆయనకు ఓ సలహా కూడా ఇచ్చారు. అదే ట్వీట్‌లో ఆనందయ్య, సోనూ సూద్‌ల పేర్లూ ప్రస్తావించారు.

నెల్లూరుకు చెందిన ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్యకు మద్దతుగా టీడీపీ గతంలో పలు వ్యాఖ్యలు చేసింది. ఆనందయ్యను ప్రభుత్వం వాడుకుంటుందంటూ నెల్లూరుకు చెందిన టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఆనందయ్య మందుకు బహిరంగంగానే మద్దతు పలికారు. చంద్రబాబు సైతం ఆనందయ్య మందుపై వైసీపీ సర్కార్ వైఖరిని పలుమార్లు తప్పుబట్టారు. ఈ విషయాల్ని ప్రస్తావిస్తూ ఆనందయ్యకు వల వేస్తే పడలేదంటూ విజయసాయిరెడ్డి చంద్రబాబుకు చురకలు అంటించారు.

Recommended Video
అంతటితో ఆగకుండా ఇప్పుడు సోనూ సూద్‌కు గాలం వేశాడు. నిస్వార్ధ సేవా కార్యక్రమాలతో ఆయన సంపాదించుకున్న మంచి పేరులో ఎంతో కొంత కొట్టేయొచ్చన్నది బాబు ప్లాన్ అంటూ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా సోనూసూద్‌తో చంద్రబాబు వర్చువల్ భేటీని ప్రస్తావిస్తూ ఈ విమర్శలు చేశారు. అయితే త్వరలోనే వీళ్ల సంగతి సోనూ సూద్‌కు తెలియకపోదు అంటూ టీడీపీ నేతలపై సాయిరెడ్డి విమర్శలు చేశారు. ఇమేజ్ పెంచుకోవడానికి అడ్డదారులుండవు బాబూ అంటూ చివర్లో ఓ సలహా కూడా ఇచ్చారు.












Click it and Unblock the Notifications