స్టే బాబు పోరంబోకు బ్యాచ్ , పావలాకు కరోనా వచ్చిందా ? చంద్రబాబు , పవన్ కళ్యాణ్ పై సాయిరెడ్డి విసుర్లు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చంద్రబాబు నాయుడిని, దేవినేని ఉమ ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు . సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి చంద్రబాబు పై సెటైర్లు వేశారు. ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేశారు.

 వైద్య శాస్త్రం పరిధిని దాటిన అంశాలంటూ చంద్రబాబు , పవన్ లపై సాయిరెడ్డి విసుర్లు

వైద్య శాస్త్రం పరిధిని దాటిన అంశాలంటూ చంద్రబాబు , పవన్ లపై సాయిరెడ్డి విసుర్లు

చంద్రబాబు కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకున్నాడు? పావలా కు అసలు కరోనా పాజిటివ్ వచ్చిందా, వస్తే మూడురోజుల్లోనే నెగిటివ్ ఎలా అయింది ? వైద్య శాస్త్రం పరిధిని దాటిన ఈ రెండు అంశాలు ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి . డబ్ల్యూహెచ్ఓ సైంటిస్టులు ఎవరైనా పరిశోధన చేస్తే బాగుండు అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

సీఎం జగన్మోహన్ రెడ్డి వీడియో మార్ఫింగ్ కేసుకు సంబంధించి మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు పై కూడా మండిపడ్డారు విజయసాయిరెడ్డి .

ఉమా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి దాక్కోవడం ఏంటి అసహ్యంగా

ఉమా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి దాక్కోవడం ఏంటి అసహ్యంగా

ఖబడ్దార్ .. తెగ్గోస్తా ... తొక్కేస్తా.. అంతు చూస్తా అంటూ హూంకరించే ఉమా పరార్ అవడం ఏంటి ? వీడియో మార్ఫింగ్ కేసులో ఇంటికి వెళ్లిన కర్నూలు పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు ఉమా అంటూ ఎద్దేవా చేశారు. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి దాక్కోవడం ఏంటి అసహ్యంగా .. లొంగిపోయి నిర్దోషిత్వం నిరూపించుకో అంటూ సెటైర్లు వేశారు. దేవినేని ఉమ తీరు చూసి మైలవరం నవ్వుతోంది అంటూ విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

స్టే బాబుపై ఉన్న కేసుల స్టే ఎత్తివేయాలని ఒత్తిడి చెయ్యాలని సవాల్

స్టే బాబుపై ఉన్న కేసుల స్టే ఎత్తివేయాలని ఒత్తిడి చెయ్యాలని సవాల్

స్టేమాన్, అతని పోరంబోకు బ్యాచ్ వైయస్ఆర్సిపి నాయకులకు రక రకాల వెర్రి సవాళ్లను విసురుతున్నారు. వారికి ధైర్యం ఉంటే, వారు చంద్రబాబు నాయుడిపై దృష్టి పెట్టాలన్నారు విజయసాయిరెడ్డి. సామూహిక అవినీతి కుంభకోణాలు, మోసం , దోపిడీకి పాల్పడిన వివిధ కేసులలో చంద్రబాబుపై ఉన్న స్టే ఎత్తివేయాలని ఒత్తిడి తీసుకురావాలన్నారు. చంద్రబాబు నాయుడికి తప్పు చేసిన పశ్చాత్తాపం కానీ, సిగ్గు కానీ లేదని విజయసాయిరెడ్డి తీవ్రంగా ఫైర్ అయ్యారు .

 బొల్లినేని ఇష్యూతో సైరా పంచ్ వేసిన సాయి రెడ్డి

బొల్లినేని ఇష్యూతో సైరా పంచ్ వేసిన సాయి రెడ్డి

ఇదే సమయంలో సైరా పంచ్ వేసిన విజయసాయిరెడ్డి సుజనా చౌదరి జిఎస్టి ఎగవేత కేసులో బొల్లినేని శ్రీనివాస్ గాంధీ అరెస్టు వార్తను గురించి ప్రస్తావిస్తూ పార్టీ లేదు బొక్క లేదని హింట్ ఇచ్చారు గాని, వ్యవస్థలో మీరు నాటిన బీజం బొల్లినేనిని కూడా బొక్కలో వేస్తారని ముందే ఎందుకు చెప్పలేదు అంటూ మహిళలు చంద్రబాబు వద్ద ఏడుస్తున్నట్టు పోస్ట్ చేశారు . ఎక్కడ ఏం జరిగినా చివరకు చంద్రబాబు వద్ద ఆగే విజయ సాయి రెడ్డి రోజుకో రకంగా చంద్రబాబును, టిడిపి నేతలను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. నిన్నటికి నిన్న చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా కూడా 38 ఏళ్ల క్రితం ఏర్పడిన పార్టీ ఈరోజు జెండా పీకేసి దశలో ఉన్న చంద్రబాబు తన జన్మదిన వేడుకల్లో ఉల్లాసంగా జరుపుకోవాలని కోరుకుంటున్నా అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు విజయసాయిరెడ్డి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+