పోతిరెడ్డిపాడుపై లేని తొందర నిమ్మగడ్డపై ఎందుకు ? బాధ్యతగా వ్యవహరించండి- సాయిరెడ్డి ట్వీట్....
రాయలసీమకు నీరందించే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడం, గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇవ్వడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటివరకూ స్పందించలేదు. సరిగ్గా ఇదే అంశాన్ని టార్గెట్ గా చేసుకుని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీకి ఇవాళ చురకలు అంటించారు.

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారంలో చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీ న్యాయపోరాటానికి సిద్ధం కావడంపై వైసీపీ ఎంపీ సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇందులో ఆయన పోతిరెడ్డి పాడు వ్యవహారంలో గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పుపై టీడీపీ స్పందించలేదని, ప్రభుత్వం కంటే ముందే ఈ కేసులో న్యాయపోరాటం చేసుంటే ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉన్నట్లు అనిపించేదన్నారు. కానీ నిమ్మగడ్డ రమేష్ వంటి పట్టించుకోనవసరం లేని వ్యక్తుల విషయంలో న్యాయపోరాటాలు చేసి చంద్రబాబు పరువు తీసుకుంటున్నారని సాయిరెడ్డి ఆరోపించారు.













Click it and Unblock the Notifications