వైసీపీకి వెయ్యి ఏనుగుల బలం ఇచ్చిన పిల్లి, అయోధ్య..!
ఏపీలో తాజాగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయం నేపథ్యంలో ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజ్యసభ ఛైర్మన్ ను కలిసి రాజీనామాలు సమర్పించారు. వీటిని ఛైర్మన్ కూడా ఆమోదించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో రెండు ఖాళీలను నోటిఫై కూడా చేసేశారు.
ఈ తరుణంలో వైసీపీకి చెందిన మరో ఆరుగురు ఎంపీలు రాజీనామా చేస్తారని అధికార కూటమి ప్రచారం చేస్తోంది. దీనిపై ఇద్దరు వైసీపీ ఎంపీలు ఇవాళ స్పందించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన వైసీపీ రాజ్యసభ ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి తమ సహచరుల రాజీనామాలపై మాట్లాడారు. వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీ వదిలేస్తున్నారు అని ప్రచారం జరుగుతోందని, జగన్ నాయకత్వాన్ని బలపరుస్తున్నామని రాజ్యసభ ఎంపీ లుగా చెప్తున్నామని పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు.

వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ నాయకత్వం లోనే పనిచేశామని, మంత్రి పదవి ఉన్న కూడా వదులుకుని వైసీపీతో పని చేసానని పిల్లి గుర్తుచేసుకున్నారు. తాను రాజకియాల్లో వచ్చిన దగ్గరనుంచి ఎవరితో పెద్దగా పరిచయం లేదని,
వైఎస్ రాజశేఖర రెడ్డి పరిచయం అయ్యాక అయనతోనే ప్రయాణం చేశానని తెలిపారు. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ తో కలిసి పని చేశానన్నారు. తాను పార్టీ వదిలి వెళ్తానని దయచేసి వార్తలు వేయొద్దన్నారు. తాను ఆర్ధికంగా పేద అయినా...విధేయతలో మాత్రం సంపన్నుడిని అని పిల్లి స్పష్టం చేశారు.
మరో ఎంపీ అయోధ్య రామిరెడ్డి స్పందిస్తూ.. ఒకరిద్దరు ఎంపీల ఆలోచన మారడం సహజమే అన్నారు. తాము పార్టీ మారడం లేదన్నారు. అనవసర దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ తోనే తమ ప్రయాణం జరుగుతుందన్నారు. ప్రతి మనిషి పార్టీకి వ్యక్తిత్వం ఉంటుందన్నారు. రాజకీయం నడపడం చాలా కష్టమని, పార్టీ అధ్యక్షుడు, క్యాడర్ కలిపి పద్ధతిగా తీసుకు రావడం కష్టమన్నారు. దేశం అన్నిటికంటే ముఖ్యమన్నారు. వ్యవస్థ పటిష్టంగా ఉండాలంటే మంచి రాజకీయ పార్టీలు ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications