బీజేపీ-వైసీపీ బంధానికి కోటంరెడ్డి పరీక్ష ! ఎన్నికల వేళ టర్నింగ్ పాయింట్ ?

ఏపీలో వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేగా మారిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను వ్యతిరేకిస్తున్న సొంత పార్టీకి ఎన్నికల ముందు షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ట్యాపింగ్ పై కేంద్రానికి ఆయన ఇచ్చిన ఫిర్యాదే దీనికి కారణం.

ఏపీలో మూడున్నరేళ్లుగా విజయవంతంగా సాగుతున్న బీజేపీ-వైసీపీ బంధానికి సార్వత్రిక ఎన్నికలకు ముందు పరీక్ష తప్పేలా లేదు. ఇప్పటికే రాజధాని అమరావతి విషయంలో వైసీపీకి చుక్కలు చూపిస్తున్న కేంద్రానికి రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజాగా మరో అస్త్రం అందించారు. అసలే మూడు రాజధానులతో పాటు సీబీఐ కేసులు, ఇతర అంశాల్లో కేంద్రం నుంచి సహకారం దొరక్క ఇబ్బందులు పడుతున్న సీఎం జగన్ కు ఇది కొత్త తలనొప్పులు తెచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేంద్రం స్పందిస్తే గతంలో చంద్రబాబు-కేసీఆర్ వివాదం తరహాలో మరో వివాదం తప్పేలా లేదు.

కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్

కోటంరెడ్డి ఫోన్ ట్యాపింగ్

ఏపీలో తన ఫోన్లు ట్యాప్ అవుతున్నాయంటూ కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాను అనుకున్న విధంగానే వైసీపీని ఇరుకునపెట్టారు. సీఎం జగన్ తో భేటీ సందర్భంగా ఆయన ప్రస్తావించిన అంశాలతో తన ఫోన్ ట్యాపింగ్ కు గురైందంటూ కోటంరెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కు ఉన్న చట్టబద్ధత నేపథ్యంలో ఈ ఆరోపణలు సహజంగానే వైసీపీ సర్కార్ ను ఇరుకునపెట్టాయి.

ట్యాపింగ్ జరగలేదని చెప్పిన వైసీపీ మంత్రులు, దాన్ని నిరూపించలేని పరిస్దితిలో ఉండటం కోటంరెడ్డికి కలిసివచ్చింది. దీంతో ట్యాపింగ్ ఆరోపణల్ని ఆయన కొనసాగిస్తున్నారు. అంతే కాదు కేంద్రానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

 అమిత్ షాకు కోటంరెడ్డి ఫిర్యాదు

అమిత్ షాకు కోటంరెడ్డి ఫిర్యాదు

తన ఫోన్లు ట్యాప్ చేస్తున్నారంటూ వైసీపీ సర్కార్ పై ఆరోపణలు చేస్తున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ నిరూపించాలంటూ వైసీపీ విసిరిన సవాల్ కు సమాధానం చెప్పకుండానే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కోటంరెడ్డి ఈ మేరకు ట్యాపింగ్ పై చర్యలు కోరుతూ లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. దీనికి కారణం గతంలో ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా ఏపీ-తెలంగాణ సీఎంల మధ్య చోటు చేసుకున్న పరిణామాలే.

పైకి ఏమీ కనిపించకపోయినా అంతర్గతంగా అప్పట్లో చాలా రచ్చే జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇద్దరు సీఎంలు ఓ అవగాహనకు రావడంతో ఈ వివాదం సద్దుమణిగిందన్న ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు కోటంరెడ్డి ఫిర్యాదు బీజేపీకి వరం కానుందా అన్న చర్చ మొదలైంది.

బీజేపీ-వైసీపీ బంధానికి పరీక్ష?

బీజేపీ-వైసీపీ బంధానికి పరీక్ష?

ఏపీలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేసిన ఆరోపణలు మామూలు పరిస్ధితుల్లో అయితే పెద్దగా ప్రభావం చూపించేవి కావు. అనుక్షణం తమకు అండగా నిలుస్తున్న వైసీపీ సర్కార్, సీఎం జగన్ పై వచ్చిన ఫిర్యాదుపై కేంద్రంలో ఎన్డీయే సర్కార్ కూడా స్పందించే అవకాశం లేదు. కానీ ఇప్పుడు పరిస్దితులు వేరు. ముఖ్యంగా వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ.. కేంద్రం దీనిపై స్పందిస్తే అది కచ్చితంగా వైసీపీ-బీజేపీ బంధంపై ప్రభావం చూపడం ఖాయమంటున్నారు.

ఇప్పటికే అమరావతి రాజధానిపై పార్లమెంటులో కేంద్రం చేసిన ప్రకటన, సుప్రీంకోర్టులో సమర్పించిన అఫిడవిట్లు వైసీపీకి తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ పై కేంద్రం స్పందిస్తే అది కచ్చితంగా వీరిద్దరి బంధంపై పెను ప్రభావం చూపడం ఖాయం.

 చంద్రబాబు-కేసీఆర్ ఎపిసోడ్ రిపీట్?

చంద్రబాబు-కేసీఆర్ ఎపిసోడ్ రిపీట్?

గతంలో 2015లో ఏపీ విభజన తర్వాత హైదరాబాద్ నుంచే పాలన సాగిస్తున్న అప్పటి ఏపీ సీఎం చంద్రబాబు తన పార్టీకే చెందిన రేవంత్ రెడ్డి సాయంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్ మద్దతు కోసం డబ్బులు ఎర చూపినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ వ్యవహారాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుగానే పసిగట్టి ఏసీబీ సాయంతో రేవంత్ రెడ్డిని పట్టుకోగలిగారు.

దీంతో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ భాగస్వామిగా ఉన్న చంద్రబాబు దీనికి కౌంటర్ గా తన ఫోన్లు ట్యాప్ చేశారని సంచలన ఆరోపణ చేశారు. ఉమ్మడి రాజధానిలో ఏపీ సీఎం ఫోన్లు ట్యాప్ చేయడం అక్రమమని, సెక్షన్ 8 ప్రయోగించి హైదరాబాద్ ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలని కోరారు. దీంతో కేంద్రం చంద్రబాబు-కేసీఆర్ ఇద్దరితో మాట్లాడి ఈ వ్యవహారాన్ని శాంతింపచేసింది. లేకపోతే ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్ ఇరుక్కునే వారు. అవినీతి కంటే ఫోన్ ట్యాపింగ్ పెద్ద వ్యవహారం కావడంతో కేసీఆర్ సర్కార్ పై కేంద్రం చర్యలు తీసుకోవాల్సి వచ్చేది.

ఇప్పుడు కోటంరెడ్డి వ్యవహారంలోనూ ఫోన్ ట్యాపింగ్ ను తేల్చేందుకు కేంద్రం రంగంలోకి దిగితే వైసీపీ తో బంధంపై పెను ప్రభావం తప్పదు. కానీ వైసీపీతో బంధం కొనసాగించాలని భావిస్తే మాత్రం ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+