వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్రంతో బంధం-ప్రత్యర్ధుల దూరం-వైసీపీ, టీడీపీ ఇద్దరి ప్లాన్ ఇదే-కేంద్రం మొగ్గు ఎటో ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో అధికార విపక్షాలైన వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న రాజకీయ క్రీడ పతాక స్ధాయికి చేరుకుంటోంది. కేంద్రంతో బలమైన బంధం లేకపోతే ఎన్నికల్లో గెలవలేమనే భయాలు ఇరు పార్టీల్ని వెంటాడుతోంది. దీంతో ఏపీలో సాగుతున్న రాజకీయ క్రీడలోకి కేంద్రంలో అధికార బీజేపీని లాగేందుకు ఇరు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే గతంలో ఎప్పుడో చంద్రబాబు హయాంలో అమిత్ షా కాన్వాయ్ పై తిరుపతిలో జరిగిన దాడిని వైసీపీ తెరపైకి తెస్తోంది. అలాగే రాష్ట్రపతి పాలనకు డిమాండ్ చేయడం ద్వారా బీజేపీ, వైసీపీ మధ్య దూరం పెంచేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.

 వైసీపీ, టీడీపీ పోరు

వైసీపీ, టీడీపీ పోరు

ఏపీలో వైసీపీ, టీడీపీ పోరుకు దశాబ్దానికి పైగా చరిత్ర ఉంది. కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేకంగా పుట్టిన వైసీపీ పదేళ్ల పోరాటం తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చింది. దీంతో జగన్ సీఎం కావడాన్ని, తమను అణచివేయడాన్ని జీర్ణించుకోలేక టీడీపీ పోరాటాలకు దిగుతోంది. అదే సమయంలో టీడీపీ నేతలు ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలకు తీవ్రంగా స్పందించడం ద్వారా ఆ పార్టీని పూర్తిగా అణగదొక్కేందుకు వైసీపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. దీంతో టీడీపీ ఆఫీసులపై దాడుల వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇది ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణాన్ని కల్పిస్తోంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా చంద్రబాబు దీక్షకు దిగితే.. టీడీపీ తీరుకు నిరసనగా వైసీపీ కూడా దీక్షలకు పిలుపునిచ్చింది.

కేంద్రాన్ని లాగుతున్న వైసీపీ, టీడీపీ

కేంద్రాన్ని లాగుతున్న వైసీపీ, టీడీపీ

ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పోరులోకి దూరేందుకు విపక్ష బీజేపీ సిద్ధంగా లేదు. అందుకే ఇరు పార్టీలదీ తప్పేనంటూ బీజేపీ కూనిరాగాలు తీస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఈ పోరులోకి లాగేందుకు ఇరు పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. కేంద్రం చేతుల్లో ఉన్న రాష్ట్రపతి పాలనతో పాటు రాజకీయ పార్టీ గుర్తింపు రద్దు వంటి అంశాల్ని టీడీపీ, వైసీపీ తెరపైకి తెస్తున్నాయి. కేంద్ర బలగాలను దించాలని టీడీపీ కోరుతుంటే, టీడీపీ నేతల అరెస్టుతో వారిని భయభ్రాంతులకు గురి చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. తద్వారా ఇరు పార్టీలు కేంద్రాన్ని తమ రచ్చలోకి ఎలాగైనా లాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

 కేంద్రంతో సంబంధాలకు తహతహ

కేంద్రంతో సంబంధాలకు తహతహ


సమాఖ్య వ్యవస్ధ అమల్లో ఉన్న మన దేశంలో కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రాలు తమకు నచ్చినా, నచ్చకపోయినా సత్సంబంధాలు కొనసాగించాల్సిందే. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తోంది. కేసులనో, విభజన హామీలనో, ఆర్ధిక సాయమనో ఏదో ఒక కారణంతో కేంద్రంలోకి ఎన్డీయే సర్కార్ కు వైసీపీ బేషరతు మద్దతిస్తోంది. అదే సమయంలో గతంలో కేంద్రంపై పోరాటం చేసి విఫలమైన టీడీపీ .. ఆ తర్వాత కేంద్ర సాయం లేకుంటే రాజకీయంగా నష్టపోవడం ఖాయమన్న విషయాన్ని గుర్తించింది. దీంతో బీజేపీతో స్నేహం కోసం టీడీపీ చేయని ప్రయత్నం లేదు. అయినా బీజేపీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఏపీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై వైసీపీతో ఫిర్యాదు పేరుతో కేంద్రానికి దగ్గరయ్యేందుకు టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.

జగన్, చంద్రబాబును వెంటాడుతున్న అనుభవాలు

జగన్, చంద్రబాబును వెంటాడుతున్న అనుభవాలు


కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు దూరమైతే ఏం జరుగుతుందో గతంలో వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరూ రుచి చూశారు. యూపీఏ ప్రభుత్వాన్ని ధిక్కరించి కాంగ్రెస్ పార్టీకి దూరమై వైసీపీని స్ధాపించిన జగన్.. ఆ తర్వాత అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు. 16 నెలలు జైలులోనూ ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత బెయిల్ దొరికింది. ఆ తర్వాత బీజేపీ ఆధ్వర్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఎన్డీయేకు దూరమైన చంద్రబాబు... ధర్మపోరాటంలో విఫలం కావడంతో కీలకమైన ఎన్నికల సమయంలో కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందలేదు. దీంతో ఎన్నికల్లో ఎన్నడూ లేనంత ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో జగన్, చంద్రబాబు ఇద్దరినీ గతానుభవాలు వెంటాడుతున్నాయి.

ప్రత్యర్ధుల్ని కేంద్రానికి దూరం చేసే యత్నం

ప్రత్యర్ధుల్ని కేంద్రానికి దూరం చేసే యత్నం

గతంలో టీడీపీతో సత్సంబంధాలు కొనసాగించిన కేంద్రం.. ఆ పార్టీ దూరమైన తర్వాత ఎలా వ్యవహరించిందో అంతా చూశారు. ఇప్పుడు వైసీపీ కూడా దూరమైతే ఏం జరుగుతుందో జగన్, చంద్రబాబుకు స్పష్టంగా తెలుసు. అందుకే వీరిద్దరు ఓవైపు కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తూ మరోవైపు ప్రత్యర్ధుల్ని కేంద్రంలోని బీజేపీకి దూరం చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఢిల్లీ స్దాయిలో సాధ్యమైనన్ని మార్గాల్లో లాబీయింగ్ కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో బీజేపీకి నమ్మకం కలిగించగలిగితే చాలు వచ్చే ఎన్నికలు పూర్తయ్యే వరకూ తమకు ఎలాంటి ఢోకా ఉండబోదని భావిస్తున్న వైసీపీ, టీడీపీ ఆ మేరకు ప్రత్యర్ధుల్ని బీజేపీకి దూరం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

కేంద్రం ఎటు మొగ్గుతుందో ?

కేంద్రం ఎటు మొగ్గుతుందో ?

రెండేళ్ల క్రితం వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీతో సత్సంబంధాలు కొనసాగిస్తున్న బీజేపీ, ఎన్డీయే సర్కార్... తాజా పరిణామాల నేపథ్యంలో ఎటు మొగ్గుతుందన్న చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పటివరకూ వైసీపీతో బాగానే ఉన్నప్పటికీ.. మారుతున్న పరిస్ధితుల్లో వైసీపీ సర్కార్ పై వ్యతిరేకత పెరుగుతుందన్న వార్తలొస్తున్నాయి. అదే సమయంలో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో వైసీపీ స్ధానంలో మరోసారి టీడీపీ, జనసేనతో కలిసి ఏపీలో రాజకీయ చక్రం తిప్పేందుకు బీజేపీ సిద్ధపడొచ్చన్న చర్చ సాగుతోంది. గతంలో కేంద్రానికి దూరమైన తర్వాత ఇప్పటివరకూ టీడీపీని దగ్గరకు రానివ్వని బీజేపీ.. మారిన పరిస్ధితుల్లో మాత్రం వైసీపీకి ప్రత్యామ్నాయంగా టీడీపీ, జనసేనతో కలిస్తే మాత్రం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారడం ఖాయం.

English summary
as political war between ysrcp and tdp continue in andhrapradesh, both parties plans to maintain good relations with bjp and distance their opponents from central govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X