స్కూల్ స్టూడెంట్ ను పెళ్లి చేసుకున్న అదే స్కూల్ టీచర్, సుందరాకాండ రిపీట్!

బెంగళూరు/బీదర్: చదువు పూర్తి చేసిన యువకుడికి ప్రభుత్వ స్కూల్ లో టీచర్ గా ఉద్యోగం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగం రావడంతో అతని కుటుంబ సభ్యులు సంతోషించారు. కొన్ని సంవత్సరాలు ఓ స్కూల్ లో ఉద్యోగం చేసిన తరువాత ఆ టీచర్ మరో స్కూల్ కు బదిలి అయ్యాడు. ఉద్యోగం చేస్తున్న ఊరిలోనే అద్దె ఇంటిలో ఉంటున్న స్కూల్ టీచర్ చేసిన పనికి ఆ ఊరి ప్రజలతో పాటు విద్యార్థుల కుటుంబ సభ్యులు హడలిపోయారు.

ఓ టీచర్ తన స్కూల్ లో చదువుతున్న విద్యార్థినిని పెళ్లి చేసుకున్న ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని భాల్కీ తాలూకాని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.మైనర్ విద్యార్థిని పెళ్లి చేసుకున్న టీచర్ పేరు దిలీప్ కుమార్. ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు. దిలీప్ కుమార్ స్వస్థలం బెళగావి. ప్రభుత్వ పాఠశాలలో దిలీప్ కుమార్ ఉపాధ్యాయుడు.

A school teacher who secretly married a girl studying in school in Karnataka

బీదర్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు దిలీప్ కుమార్ బదిలి అయ్యాడు. దిలీప్ కుమార్ ఉద్యోగం చేస్తున్న పాఠశాలలో చదువుతున్న 15 ఏళ్ల విద్యార్థి ఇంటిలో గత మార్చి నెలలో దిలీప్ కుమార్ అద్దె ఇంట్లో చేరాడు. అమ్మాయి ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో ఆమెతో దిలీప్ కుమార్ చనువు పెంచుకుని ఆమెతో సరసాలు ఆడటం మొదలుపెట్టాడు.

తరువాత అమ్మాయిని బెదిరించి ఆమెతో శారీరక సంబంధాన్ని పెంచుకున్నాడు. కుటుంబ సభ్యులు లేని సమయంలో విద్యార్థిని లొంగదీసుకుని ఇంట్లోనే ఆమె మెడలో తాళికట్టాడు. తరువాత తాళి తీసి దాచిపెట్టాలని, నువ్వే నా భార్య అంటూ దిలీప్ కుమార్ ఆ అమ్మాయితో ఎంజాయ్ చెయ్యడం మొదలుపెట్టాడు. ఇటీవల టీచర్ దిలీప్ కుమార్ పెళ్లి పురాణం బట్టబయలైంది.

షాకింగ్ విషయం ఏంటంటే టీచర్‌ దిలీప్ కుమార్ కు అప్పటికే పెళ్లి అయ్యిదని, బెళగావిలో భార్య, ఒక పిల్లాడు కూడా ఉన్నాడని వెలుగు చూడటంతో గ్రామస్తులు హడలిపోయారు. ఇంత చేసినా దిలీప్ కుమార్ తన పాఠశాల విద్యార్థినిని వివాహం చేసుకున్నాడనే విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఉపాధ్యాయుడిపై మెహకర పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయకుండా విధులు నుంచి తొలగించకుండా అధికారులు చోద్యం చూస్తున్నారని గ్రామస్తులు మండిపడుతున్నారు. అయితే టీచర్ దిలీప్ కుమార్ సెలవు మీద వెళ్లిపోయాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారులు తెలిపారు. అయితే టీచర్ దిలీప్ కుమార్ హైదరాబాద్ పారిపోయాడని తెలిసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+