ఫ్రీ బియ్యం పంపిణి, ఎన్ని లక్షల రేషన్ కార్డులు పెండింగ్ లో ఉన్నాయంటే, మంత్రి క్లారిటి!
బెంగళూరు: అన్నభాగ్య, గృహలక్ష్మి యోజన అమలు తర్వాత కర్ణాటక ప్రభుత్వం బీపీఎల్, ఏపీఎల్ కార్డుల దరఖాస్తుల స్వీకరణను నిలిపివేసింది. బీపీఎల్ కార్డుల పంపిణీకి సంబంధించి ప్రభుత్వం ఇప్పుడు కీలక సందేశం ఇచ్చింది. అతి త్వరలో రేషన్‌కార్డుల పంపిణీ చేయనున్నట్లు సమాచారం. కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖకు 2017 నుంచి ఇప్పటి వరకు 3.9 లక్షలకు పైగా దరఖాస్తులు అందాయి.
దారిద్య్ర రేఖకు దిగువన (బీపీఎల్) రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కర్ణాటక ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి కేహెచ్, మునియప్ప తెలిపారు. 2017 నుండి 3.9 లక్షలకు పైగా బీపీఎల్ కార్డుల కోసం దరఖాస్తులు, 7.11 లక్షల ఏపీఎల్ కార్డుల కోసం దరఖాస్తులు వచ్చాయని, ఆ కార్డుల పరిశీలన మొత్తం పెండింగ్‌లో ఉన్నాయని కర్ణాటక ప్రభుత్వం అంటోంది. కర్ణాటక మంత్రి మునియప్ప విలేకరులతో మాట్లాడుతూ ఈ దరఖాస్తులను పరిశీలించి త్వరలో క్లియర్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా ఆమోదం పొందని 40 లక్షల మంది లబ్ధిదారులకు బియ్యం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక పథకానికి కృషి చేస్తోందని కర్ణాటక మంత్రి కేహెచ్. మునియప్ప తెలిపారు. వీరిని అన్నభాగ్య యోజన కిందకు తీసుకురావడానికి ప్రభుత్వం రూ.1, 680 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం ఉన్న 22 లక్షల మంది బీపీఎల్ కార్డు హోల్డర్లు చనిపోవడం, కుటుంబ పెద్ద పేరు వంటి వివిధ కారణాల వల్ల డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులు పొందలేని వారికి సహాయం చేయడానికి కర్ణాటక రాష్ట్రం చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. కార్డులో మార్చబడలేని వారికి అన్నభాగ్య పథకం కింద అదనంగా వచ్చే 5 కిలోల బియ్యం నెలరోజులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని మంత్రి కేహచ్. మునియప్ప తెలిపారు.
బీపీఎల్ కార్డుదారులకు అదనపు బియ్యం బదులు నగదు ఇస్తున్నామని, డీబీటీ ద్వారా కోటి కుటుంబాలకు నగదు బదిలీ చేసినట్లు మంత్రి మునియప్ప అన్నారు. రేషన్ వ్యవస్థను సులభతరం చేసేందుకు ఇంటింటికి సర్వే నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. అర్హులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు అనర్హులు పథకం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామని మంత్రి మునియప్ప అంటున్నారు.












Click it and Unblock the Notifications