బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Lady: విదేశాల్లో ఉద్యోగం, కువైట్ లో పిల్లల తల్లిని ఎన్ని కక్షలకు అమ్మేశాడంటే ?, ఏజెంట్ ల దందాతో!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ కొడుగు: విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని ఓ మహిళను కువైట్ దేశానికి అమ్మేసిన షాకింగ్ నెట్‌వర్క్ దందా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని కొడగు జిల్లా విరాజ్‌పేట్ తాలూకాలోని కరాడిగోడ్ గ్రామానికి చెందిన చిక్కి అలియాస్ చిక్కమ్మ అనే మహిళ కుమార్తె పార్వతి (35) అనే మహిళను కువైట్ లో అమ్మేయడంతో ఆమె ప్రస్తుతం ఆదేశంలో కష్టాల్లో ఉందని వెలుగు చూసింది.

ఇద్దరు పిల్లల ఉన్న పార్వతి ఆమె భర్తకు దూరం అయ్యింది. విదేశాల్లో 30 వేల జీతం ఇస్తానని ఊటీలోని హనీఫ్ అనే ప్రైవేట్ ఏజెంట్ పార్వతికి మాయమాటలు చెప్పి కువైట్ పిలుచుకుని వెళ్లి తరువాత ఆమెను అక్కడ ఓ గ్యాంగ్ కు కొన్ని లక్షల రూపాయలకు విక్రయించినట్లు వెలుగు చూడటం కలకలం రేపింది. పార్వతిని కువైట్ లో అమ్మేసిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Wife: బిగ్ షాట్ భార్య, భర్త ఫ్రెండ్ తో రొమాన్స్, భర్త హత్యకు ఆన్ లైన్ లో ఏం ఆర్డర్ చేసిందంటే, కిల్ కిలాడి!Wife: బిగ్ షాట్ భార్య, భర్త ఫ్రెండ్ తో రొమాన్స్, భర్త హత్యకు ఆన్ లైన్ లో ఏం ఆర్డర్ చేసిందంటే, కిల్ కిలాడి!

కేరళలో పని చేసింది

కేరళలో పని చేసింది

ఇద్దరు చిన్న పిల్లలు, వయసు మళ్లిన తల్లిదండ్రులను సంతోషంగా చూసుకోవాలని పార్వతి అనుకుంది. పిల్లల భవిష్యత్తు ఆలోచించిన పార్వతి విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించాలనే నిర్ణయానికి వచ్చింది. కొన్ని సంవత్సరల క్రితం పార్వతి కేరళలోని తాలాచేరిలో ఓ ఇంటిలో పని మనిషిగా చేరింది. అక్కడ కొన్నాళ్లు పనిచేసిన పార్వతికి అదే ప్రాంతంలో కావేరి అనే మహిళ పరిచయం అయ్యింది.

తరువాత కావేరి ద్వారా పార్వతికి ఊటీకి చెందిన హనీఫ్‌ అనే ఏజెంట్ తో పరిచయం అయ్యింది. కువైట్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని హనీఫ్ కొడుగుకు చెందిన పార్వతికి మాయమాటలు చెప్పాడు. హనీఫ్ మాటలు నమ్మిన పార్వతి ఇతరుల దగ్గర అప్పులు చేసి ఆ డబ్బులో కొంచెం ఏజెంట్ హనీఫ్ కు ఇచ్చి, కొంత తల్లిదండ్రులకు ఇచ్చింది. నాలుగు నెలల క్రితం పార్వతి కువైట్ బయలుదేరింది.

విజటర్స్ వీసా

విజటర్స్ వీసా

విజిటర్స్ వీసా మీద కొచ్చి విమానాశ్రయం నుంచి పార్వతి విదేశాలకు బయలుదేరింది. కొచ్చి నుంచి నేరుగా మస్కట్‌కు వెళ్లి అక్కడ నుంచి పార్వతి కువైట్‌ చేరుకుందని వెలుగు చూసింది. మూడు నెలలపాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓ ఇంట్లో పార్వతి పని చేసింది. ఇంటి పనిలో చేరి మూడు నెలలు గడిచిపోయిన తరువాత పార్వతి విజిటర్స్ వీసా గడువుకూడా ముగిసిపోయింది. కువైట్‌లోని శ్రీలంక ఏజెన్సీకి చెందిన వ్యక్తి పార్వతిని వేరే ఇంట్లో ఉద్యోగంలో చేర్పిస్తానని చెప్పి ఓ ఇంటి గదిలో నిర్బంధించాడు.

శ్రీలంక ఏజెంట్

శ్రీలంక ఏజెంట్

తరువాత పార్వతికి లేనిపోని సమస్యలు ఎదురైనాయి. విజిటర్స్ వీసా గడువు ముగియడంతో పార్వతి కువైట్ లో ఇల్లు వదిలి బయటకు వెళ్లలేని పరిస్థితి ఎదరైయ్యింది. ఇక్కడ తనకు ఎలాంటి పని లేదని, మూడు పూటల భోజనం అందించడం లేదని, నన్ను మా దేశానికి పంపమని అడిగితే శ్రీలంక ఏజెన్సీకి చెందిన వ్యక్తి మూడు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నాడని, లేదంటే కనీసం ఆరు నెలలు ఫ్రీగా పని చెయ్యాలని చెబుతున్నాడని పార్వతి బోరున విలపిస్తూ కొడుగులోని ఆమె కుటుంబసభ్యులకు వాట్సాప్ కాల్ చేసింది.

రూ. 3 లక్షలకు పిల్లల తల్లిని అమ్మేశాడు

రూ. 3 లక్షలకు పిల్లల తల్లిని అమ్మేశాడు

ఊటీకి చెందిన హనీఫ్ కొడుగు మహిళ పార్వతిని రూ. 3 లక్షలకు అమ్మేసినట్లు సమాచారం. పార్వతి కుటుంబీకులు ఊటీకి చెందిన హనీఫ్ కు ఫోన్ చేసి అడగగా అతను ఏదో ఒకరకంగా మాట్లాడి తప్పించుకుని తిరుగుతున్నాడని, సక్రమంగా సంప్రధించడంలేదని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తన కుమార్తె పార్వతిని క్షేమంగా తీసుకురావాలని కొడగు జిల్లా అధికార యంత్రాంగానికి ఆమె తల్లి మనవి చేసింది. పార్వతి కుటుంబం జిల్లా అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేయడంతో, జిల్లా యంత్రాంగం భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో సంప్రధింపులు జరుపుతున్నారని తెలిసింది.

అధికారులు ఎంట్రీ

అధికారులు ఎంట్రీ

ఈ విషయాన్ని కొడగు విపత్తు నిర్వహణ నిపుణుడు అనన్యవాసుదేవ్ ఇప్పటికే భారత రాయబార కార్యాలయ అధికారులకు తెలియజేశారు. ఈ విషయం గురించి కొడగు చెందిన అధికారి అనన్య వాసుదేవ్ మాట్లాడుతూ భారత రాయబార కార్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చామని, కువైట్ లో ఉన్న బాధితురాలు పార్వతికి ఫోన్ చేసి మాట్లాడి ఆమె ఉన్న ప్రదేశాన్ని గుర్తించామని, వీలైనంత త్వరగా ఆమెను క్షేమంగా భారత్ తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని చెప్పారు.

English summary
Bengaluru: An agent who sold a lady in Kuwait called with a visitor's visa saying that he would be given a job abroad
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X