బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Breaking news: కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, అదే మార్క్, అదే వర్గం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా బసవరాజ్ బోమ్మయ్ ని బీజేపీ హైకమాండ్ నియమించింది. మంగళవారం రాత్రి బెంగళూరులోని ప్రైవేట్ హోటల్ లో జరిగిన బీజేపీ శాసనసభ్యుల సమావేశంలో కర్ణాటక శాసనసభా పక్షనేతగా బసవరాజ్ బోమ్మయ్ ని ఎన్నుకున్నారు. కర్ణాటక పార్టీ పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రులు ధరేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, బీజేపీ కర్ణాటక ఇన్ చార్జ్ అరుణ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ శాసన సభ్యుల సమావేశంలో ఆ పార్టీ శాసనసభా పక్ష నేతగా బసవరాజ్ బోమ్మయ్ ని ఎన్నుకున్నారు. బుధవారం బెంగళూరులోని రాజ్ భవన్ లో బసవరాజ్ బోమ్మయ్ కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చెయ్యనున్నారు.

టెన్షన్...... టెన్షన్

టెన్షన్...... టెన్షన్

బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్ లో మంగళవారం రాత్రి కర్ణాటక బీజేపీ శాసనసభ్యుల సమావేశం జరిగింది. కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ఎమ్మెల్యేల అభిప్రాయాలను బీజేపీ అధిష్టానం సూచించిన నాయకులు సేకరించారు. కొంతసేపు కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.

కిషన్ రెడ్డి, డీకే ఆరుణ ఎంట్రీ

కిషన్ రెడ్డి, డీకే ఆరుణ ఎంట్రీ

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు ? అనే విషయంపై మంగళవారం రాత్రి బెంగళూరులోని ఓ స్టార్ హోటల్ లో బీజేపీ ఎమ్మెల్యేలతో బీజేపీ నాయకులు సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్ర మంత్రులు దర్రేంద్ర ప్రధాన్, జీ. కిషన్ రెడ్డి, కర్ణాటక బీజేపీ వ్యవహారాల ఇన్ చార్జ్ అరుణ్ సింగ్, తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు డీకే. అరుణ కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేలతో చర్చించారు.

గన్ షాట్ బోమ్మయ్

గన్ షాట్ బోమ్మయ్

కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు, అంతకు ముందే ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ వ్యవహారాల బోర్డు సభ్యుల అభిప్రయాలను పరిశీలించిన బీజేపీ హైకమాండ్ ప్రస్తుత కర్ణాటక హోమ్ మంత్రి బసవరాజ్ బోమ్మయ్ ని కర్ణాటక ముఖ్యమంత్రి చెయ్యాలని ఏకాభిప్రాయానికి వచ్చింది.

 అదే సామాజిక వర్గం

అదే సామాజిక వర్గం


కర్ణాటక రాజకీయాల్లో, బీజేపీలో చక్రం తిప్పుతున్న లింగాయత్ వర్గానికి చెందిన బీఎస్. యడియూరప్ప నిన్న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. బీఎస్ యడియూరప్ప లింగాయత వర్గానికి చెందినవారు. ఇప్పుడు బసవరాజ్ బోమ్మయ్ కూడా లింగాయత్ వర్గానికి చెందిన వారే.

Recommended Video

Karnataka BJP crisis: CM BS Yediyurappa resigns, will meet Governor at 4pm
యడియూరప్ప మార్క్

యడియూరప్ప మార్క్

బీఎస్ యడియూరప్పకు సుమారు 500 మంది స్వామీజీలు మద్దతు ఇచ్చిన నేపథ్యంలో మళ్లీ అదే వర్గానికి చెందిన బసవరాజ్ బోమ్మయ్ ని సీఎంను చేసిన బీజేపీ హైకమాండ్ ఇటు బీఎస్ యడియూరప్పను, ఇటు లింగాయత్ సమాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నించింది. మొత్తం మీద మంగళవారం రాత్రి కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు అనే విషయానికి బ్రేక్ పడింది.

English summary
Breaking news: BJP leader Basavaraj Bommai new Chief Minister to Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X