Coronavirus: కర్ణాటకలో లాక్ డౌన్ పొడగింపు, ఐటీ హబ్ లో భారీ మార్పులు, వీకెండ్ లో, సీఎం !
బెంగళూరు: కర్ణాటక మహమ్మారి దెబ్బతో మరోసారి కర్ణాటకలో లాక్ డౌన్ పొడగించారు. ఐటీ హబ్ బెంగళూరు నగరంతో సహ పలు జిల్లాల్లో లాక్ డౌన్ నియమాల్లో కొన్ని నియమాలు సడలించారు. కరోనా వైరస్ భరతనాట్యం చేస్తున్న 11 జిల్లాల్లో లాక్ డౌన్ లో ఎలాంటి మార్పులు లేవని, ఇప్పుడు ఉన్న నియమాలు కచ్చితంగా పాటించాలని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అన్నారు. జూన్ 14వ తేదీ లాక్ డౌన్ ముగిసిపోతుందని బావిస్తున్న కొందరికి సీఎం బీఎస్. యడియూరప్ప ఇచ్చిన క్లారిటీతో నెత్తిన పిడుగు పడినట్లు అయ్యింది. జూన్ 14వ తేదీన లాక్ డౌన్ ముగుస్తుందని అనుకున్న పలువురు వ్యాపారు డీలాపడిపోయారు.
Recommended Video

సీఎంకు సలహా ఇచ్చిన మంత్రులు, నిపుణులు
గురువారం రాత్రి బెంగళూరులోని సీఎం బీఎస్ యడియూరప్ప అధికార నివాసంలో కర్ణాటక మంత్రులు, పలువిభాగాల అధికారులు, నిపుణులతో చర్చించారు. జూన్ 14వ తేదీతో లాక్ డౌన్ గడుపు ముగిస్తున్న సందర్బంగా లాక్ డౌన్ పొడగించాలా ?, అన్ లాక్ ప్రకటించాలా ? అంటూ సీఎం బీఎస్ యడియూప్ప అందరి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.
11 జిల్లాలో కరోనా భరతనాట్యం
కర్ణాటకలోని 11 జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి భరతనాట్యం వేస్తోందని, లాక్ డౌన్ అమలు ఉన్నా ఆ జిల్లాలో కరోనా వైరస్ తాండవం చేస్తోందని పలువురు మంత్రులు, అధికారులు సీఎం బీఎస్. యడియూరప్పకు చెప్పారు. కర్ణాటకలోని 11 జిల్లాలో యధావిదిగా లాక్ డౌన్ కొనసాగించాలని ఆ జిల్లాల ఇన్ చార్జ్ మంత్రులు, కలెక్టర్లు, అధికారులు సీఎం బీఎస్. యడియూరప్పకు మనవి చేశారు.

అక్కడ సేమ్ సీన్...... ఇక్కడ కొంచెం మార్పులు
కర్ణాటకలోని బెంగళూరు గ్రామీణ జిల్లా, మైసూరు, బెళగావి, శివమొగ్గ, దావణగెరె, చిక్కమగళూరు, చామరాజనగర, హాసన్, దక్షిణ కన్నడ జిల్లా, కోడుగు, మండ్య జిల్లాలో ప్రస్తుతం ఉన్న లాక్ డౌన్ యాధివిదిగా కొనసాగుతుందని, మిగిలిన జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నాం 2 గంటల వరకు లాక్ డౌన్ నియమాలు సడలిస్తున్నామని సీఎం బీఎస్ యడియూరప్ప అన్నారు.

తేడా వస్తే అంతే కథ
బెంగళూరు నగరంతో పాటు కర్ణాటకలో పైన తెలిపిన జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో లాక్ డౌన్ నియమాల్లో మార్పులు చేశారు. ఉదయం 6 గంటల నుంచి 2 గంటల వరకు అధికారులు సూచించిన వ్యాపారాలు చేసుకోవచ్చని, రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది.

జూన్ 21 వరకు సేమ్ సీన్
కర్ణాటక వ్యాప్తంగా శుక్రవారం రాత్రి 7 గంటల నుంచి సోమవారం వేకువ జామున 5 గంటల వరకు నరవదిక కర్ణ్యూ అమలు చేస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప చెప్పారు. జూన్ 21వ తేదీ వరకు కర్ణాటకలో లాక్ డౌన్ అమలులో ఉంటుందని సీఎం బీఎస్ యడియూర్ప మీడియాకు చెప్పారు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications