డీకే శివకుమార్ కు ఊహించని షాక్, డీసీఎం ఔట్, కార్యక్రమంలో సీఎంకు!
బెంగళూరు/మైసూరు: కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే. శివకుమార్ కు లాయర్లు ఊహించని షాక్ ఇచ్చారు. మైసూర్‌లో ఆగస్టు 12న జరగనున్న రెండు రోజుల రాష్ట్ర స్థాయి న్యాయవాదుల సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమం ఆహ్వాన పత్రికలో ముఖ్య అతిధుల జాబితా నుంచి కర్ణాటక రాష్ట్ర బార్ కౌన్సిల్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పేరును తొలగించింది.
పలు కేసులు పెండింగ్‌లో ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యాయమూర్తులతో వేదిక పంచుకోవడంపై వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎఎస్ బోపన్న, కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రసన్న బి వరాలే, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మనన్ కుమార్ మిశ్రా, కర్ణాటక న్యాయశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి హెచ్ కె పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.

బీజేపీ ఎమ్మెల్యే, మాజీ న్యాయశాఖ మంత్రి ఎస్.సురేష్ కుమార్ ఆగస్టు 12న జరగనున్న కార్యక్రమానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి, మరో న్యాయమూర్తితో వేదిక పంచుకోవడంపై అభ్యంతరం తెలుపుతూ కర్ణాటక హైకోర్టు రిజిస్ట్రార్‌కు లేఖ రాయడంతో డీకే శివకుమార్ పేరు తొలగించారు. డీకే శివకుమార్‌పై సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
డీకే శివకుమార్‌పై సుప్రీంకోర్టు, కర్ణాటక హైకోర్టుల్లో అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అలాంటి వ్యక్తులు ఆ కార్యక్రమంలో సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులతో వేదిక పంచుకోవడం సరైనదేనా అని బీజేపీ సీనియర్ నేత ఎస్ సురేష్ కుమార్ ప్రశ్నించారు. 2019 సెప్టెంబర్‌లో శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీలాండరింగ్ కేసులో అరెస్టు చేసింది. 50 రోజుల పాటు జైలు జీవితం తర్వాత బెయిల్‌పై విడుదలయ్యాు. గత ఏడాది మేలో ఢిల్లీ కోర్టులో డీకే శివకుమార్ మీద చార్జిషీట్ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications