Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Drug mafia: మాజీ హోమ్ మంత్రి కొడుకు అరెస్టు, అనూప్ ఎఫెక్ట్, ఏమిటిది?ఎలా కనిపిస్తున్నాము?, స్టోరీ!

బెంగళూరు/ కొచ్చి/ ముంబాయి: డ్రగ్స్ మాఫియా కేసు అనేక మలుపులు తిరిగి ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్లిపోతుంది. డ్రగ్స్ మాఫియా కేసులో అరెస్టు అయిన అనూప్ తో ఆర్థిక లావాదేవీలు పెట్టుకున్నాడని ఆరోపిస్తూ మాజీ హోమ్ మంత్రి కొడుకును ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.

విచారణ సందర్బంగా చూపించిన అన్ని పత్రాలు తప్పుల తడక, ఇదో గోల్ మాల్ అని వెలుగు చూడటంతో ఏమిటిది ? ఎలా కనపడుతున్నాము ? సినిమా స్టోరీ చెబుతున్నావా ? అంటూ మాజీ హోమ్ మంత్రి కొడుకును డ్రగ్స్ కేసులో అరెస్టు చేశారు. ఈ దెబ్బతో మాజీ హోమ్ మంత్రి బాలకృష్ణన్ తో పాటు ఆయన వర్గీయులు హడలిపోతున్నారు.

అనూప్ తో ఎవరెవరికి లింక్?

అనూప్ తో ఎవరెవరికి లింక్?

డ్రగ్స్ మాఫియా కేసులో ఇప్పటికే డ్రగ్ పెడ్లర్ అనూప్ మొహ్మద్ ను ఎన్ సీబీ అధికారులు అరెస్టు చేశారు. డ్రగ్స్ మాఫియాతో లింక్ పెట్టుకున్న అనూప్ అనేక మందికి డ్రగ్స్ విక్రయించాడని అధికారులు గుర్తించారు. డ్రగ్ పెడ్లర్ అనూప్ మొహ్మద్ తో ఎవరెవరికి లింక్ లు ఉన్నాయి ? సార్ తో ఎవరెవరు టచ్ లో ఉన్నారు ? అంటూ ఎన్ సీబీ, ఈడీ అధికారులు ఆరా తీశారు.

తెర మీదకు బినేష్ కోడియేరి

తెర మీదకు బినేష్ కోడియేరి

కేరళ మాజీ హోమ్ మంత్రి, ఆ రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకుడైన కోడియేరి బాలకృష్ణన్ కొడుకు బినేష్ కోడియేరి పేరు తెర మీదకు వచ్చింది. డ్రగ్ పెడ్లర్ అనూప్ మొహ్మద్ తో మాజీ హోమ్ మంత్రి కోడియేరి బాలకృష్ణన్ కొడుకు బినేష్ కోడియేరికి దగ్గరి సంబంధాలు ఉన్నాయని విచారణ అధికారులు గుర్తించారు.

బినేష్ బేగాబాప్పా

బినేష్ బేగాబాప్పా

డ్రగ్ పెడ్లర్ అనూప్ మొహ్మద్ తో బినేష్ కోడియేరికి లింక్ ఉందని తెలుసుకున్న అధికారులు అక్టోబర్ 6వ తేదీన విచారణకు హాజరుకావాలంటూ అతనికి నోటీసులు జారీ చేశారు. బినేష్ ఎల్లిదిరప్పా, బేగాబాప్పా (బినేష్ ఎక్కడ ఉన్నావ్, త్వరగా రండి) అంటూ అధికారులు పిలవడంతో ఈనెల 6వ తేదీన బినేష్ బెంగళూరు నగరంలోని శాంతినగర్ లోని ఈడీ అధికారుల కార్యాలయంలో హాజరైనారు.

రెస్టారెంట్ కోసం ఇచ్చాను

రెస్టారెంట్ కోసం ఇచ్చాను

కేరళ మాజీ హోమ్ మంత్రి కోడియేరి బాలకృష్ణన్ కొడుకు బినేష్ కోడియేరి డ్రగ్ పెడ్లర్ అనూప్ మొహ్మద్ కు భారీ మొత్తంలో నగదు ఇచ్చాడని అధికారులు గుర్తించారు. అక్టోబర్ 6వ తేదీన విచారణకు హాజరైన బినేష్ అధికారుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు. అనూప్ మొహ్మద్ బెంగళూరులో రెస్టారెంట్ ప్రారంభించాలంటే తాను ఆర్థిక సహాయం చేశానని, డ్రగ్స్ కు తనకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ అధికారులకు బినేష్ కోడియేరి చెప్పారు.

సార్.... తీసుకోండి

సార్.... తీసుకోండి

అక్టోబర్ 6వ తేదీన బినేష్ ను విచారణ చేసిన అధికారులు మీరు రెస్టారెంట్ కోసమే నగదు ఇచ్చారు అని సరైన పత్రాలు తీసుకుని రావాలని సూచించారు. గురువారం (ఈనెల 29)వ తేదీ మళ్లీ బెంగళూరులోని శాంతినగర్ లోని ఈడీ అధికారుల కార్యాలయానికి వెళ్లిన మాజీ హోమ్ మంత్రి కొడుకు బినేష్ అధికారులకు కొన్ని పత్రాలు సమర్పించాడు.

Recommended Video

    Trump To Bring Back Drug Making To US From India And China
    ఏమిటిది ? ఎలా కనపడుతున్నాము

    ఏమిటిది ? ఎలా కనపడుతున్నాము

    సుమారు నాలుగు గంటల పాటు బినేష్ విచారణ చేసి అతను ఇచ్చిన పత్రాలు పరిశీలించిన ఈడీ అధికారులు మేము నీకు ఎలా కనపడుతున్నాము ? ఏమిటీ పత్రాలు ? అంటూ బినేష్ ను ప్రశ్నించి మండిపడ్డారని తెలిసింది. మాజీ హోమ్ మంత్రి కొడుకు బినేష్ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఈడీ అధికారులు అతన్ని అరెస్టు చేశారు. కేరళ మాజీ హోమ్ మంత్రి కొడుకు బినేష్ కు అనూప్ మొహ్మద్ బినామి అంటూ ఈడీ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డ్రగ్స్ పెడ్లర్ అనూప్ మొహ్మద్ తో బినేష్ కు దగ్గరి సంబంధాలు ఉన్నాయని, అందుకే అరెస్టు చేశారని వెలుగు చూడటంతో కేరళలో కలకలం రేపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+