officer: రూ. 450 కోట్ల భూమి రూ. 250 కోట్లకు డీల్ చేశా, తిరుపతిలో స్కెచ్ వేసిన శ్రీనివాస్, తీరా చూస్తే ?

టిప్ టాప్ గా ఇన్నోవా కారులో ఐపీఎస్ అధికారులు వేసుకునే డ్రస్ వేసుకుని వెలుతున్న అతనికి పోలీసు అధికారులు సెల్యూట్ చేశారు.

బెంగళూరు/మైసూరు: ఓ యువకుడు ఐపీఎస్ అధికారులు వేసుకునే ఖాకీ దుస్తులు వేసుకుని ఐపీఎస్ సింబల్ పెట్టుకుని పోలీస్ స్టేషన్ లకు వెలుతున్నాడు. తాను ఇటీవలే ఐపీఎస్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నానని, త్వరలో మీ పోలీస్ స్టేషన్ కు డీఎస్పీగా వస్తానని చెప్పి పలు పోలీస్ స్టేషన్లు తిరిగాడు. టిప్ టాప్ గా ఇన్నోవా కారులో ఐపీఎస్ అధికారులు వేసుకునే డ్రస్ వేసుకుని వెలుతున్న అతనికి పోలీసు అధికారులు సెల్యూట్ చేశారు. తరువాత మనోడు నకిలి ఐపీఎస్ అధికారి అని, రూ. 2.50 కోట్ల కుచ్చుటోపీ పెట్టి తిరుగుతున్నాడని వెలుగు చూడటంతో బెంగళూరు పోలీసులు షాక్ అయ్యారు.

 బెంగళూరులో నకిలి ఐపీఎస్ అధికారి

బెంగళూరులో నకిలి ఐపీఎస్ అధికారి

శ్రీనివాస్ అనే యువకుడు ఖాకీ దుస్తులు, ఐపీఎస్ అధికారుల పెట్టుకునే చిహ్నం ధరించి బెంగళూరులోని పలు పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లాడు. తాను ప్రొబేషనరీ ఎస్పీ అని పరిచయం చేసుకున్నాడు., ఐపీఎస్‌ చిహ్నాన్ని చూసి పోలీసులకు శ్రీనివాస్ కు పాదాభివందనం చేశారు.
నిందితుడు శ్రీనివాస్ బెంగళూరుకు చెందిన వెంకటనారాయణను మోసం చేశాడని వెలుగు చూడటంతో నకిలీ ఎస్పీపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది.

తిరుపతికి టూర్ వెళ్లారు

తిరుపతికి టూర్ వెళ్లారు


వెంకటరమణప్ప అనే వ్యక్తి ద్వారా వెంకటనారాయణకు నకిలీ ఎస్పీ శ్రీనివాస్ పరిచయమైనట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. వెంకట నారాయణ గతేడాది జూన్‌లో శ్రీనివాస్‌ను కలిశాడు. ఇద్దరూ స్నేహితులు అయ్యారు. శ్రీనివాస్‌తో పాటు రిటైర్డ్ ఏఎస్సై ముత్తెగౌడతో కలిసి వెంకటనారాయణ తిరుపతి పర్యటనకు వెళ్లారు. ఈ సమయంలో శ్రీనివాస్ మాట్లాడుతూ నేను బెంగళూరు నగరంలో ఎస్పీగా పనిచేస్తున్నానని వెంకటనారాయణను తిరుపతిలో పరిచయం చేసుకున్నాడు.

మైసూరులో రూ. 450 కోట్ల భూమి డీల్

మైసూరులో రూ. 450 కోట్ల భూమి డీల్

నేను మైసూర్‌లో లిటిగేషన్ ల్యాండ్ కేసును డీల్ చేస్తున్నానని, కొన్ని కేసులు పెండింగ్ లో ఉన్నాయని, రూ. 450 కోట్ల విలువైన భూమి మనకు రూ. 250 కోట్లకు వచ్చేలా డీల్ జరుగుతుందని శ్రీనివాస్ అమాయకుడైన వెంకటనారాయణను నమ్మించాడు. ఇందుకు సంబంధించి రూ. 2.5 కోట్లు అవసరమని, ఎక్కడైనా అప్పు చేసి ఇప్పించాలని, త్వరలో తాను తిరిగి ఇచ్చేస్తానని శ్రీనివాస్ అతనికి మాయమాటలు చెప్పాడు.

రూ. 2.50 కోట్లతో ఎస్కేప్

రూ. 2.50 కోట్లతో ఎస్కేప్

కొన్ని రోజుల తర్వాత శ్రీనివాస్ మళ్లీ వెంకటనారాయణ స్నేహితుడు వెంకట్నాప్ప ఆఫీసు దగ్గరకు ఐపీఎస్ అధికారి యూనిఫాంలో ఇన్నోవా కారులో వచ్చాడు. తాను ఐపీఎస్ అధికారినని వెంకటనారాయణను పూర్తిగా నమ్మించాడు. వెంకటనారాయణ కూడా శ్రీనివాస్‌కి తన స్నేహితుల దగ్గర నుంచి రూ. 2.5 కోట్లు అప్పు ఇప్పించాడు. రూ. 2.50 కోట్లు తీసుకున్న శ్రీనివాస్ అతని మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాయం అయ్యాడు. మోసపోయానని తెలుసుకున్న వెంకటనారాయణ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నకిలి ఐపీఎస్ అధికారి శ్రీనివాస్ కోసం బెంగళూరు పోలీసులు గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+