Family: విధి ఆడిన వింతనాటకం. సుమా ఫ్యామిలీ సర్వనాశనం, కూతురిని ఏం చేసిందంటే?
బెంగళూరు: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు చాలా సంతోషంగా జీవించారు. కుమార్తె అంగవైకల్యంతో బాధపడుతున్నా తండ్రి కష్టపడి ఆమెను చాలా బాగా చూసుకుంటున్నాడు. అయితే విధి ఆడిన వింతనాటంతో ఆ కుటుంబంలోని జీవితాలు సర్వనాశనం అయ్యాయి. దెబ్బ మీద దెబ్బ పడటంతో మహిళ తట్టుకోలేపోయింది.

బెంగళూరులో దంపతులు
బెంగళూరు సిటీలోని బ్యాడరహళ్లిలో సుమా అనే మహిళ నివాసం ఉంటున్నది. 14 సంవత్సరాల క్రితం సుమాకు వివాహం అయ్యింది. సుమాకు ప్రియాంక (10) అనే కుమార్తె, ఓ కుమారుడు ఉన్నాడు. సుమా దంపతులు బ్యాడరహళ్లిలో నివాసం ఉంటూ కూతురు, కుమారుడితో కలిసి చాలా సంతోషంగా జీవించారు.

అంతవరకు అందరూ హ్యాపీ
ఎవరు చూసినా మీరు హ్యాపీగా ఉన్నారు అంటూ అనే వాళ్లే అని తెలిసింది. సుమా కుమార్తె అంగవైకల్యంతో బాధపడుతున్నది. సుమా ఇంటి దగ్గరే ఉంటూ కుమార్తెను చూసుకుంటున్నది. సుమా భర్త ఉద్యోగం చేస్తూ భార్య, పిల్లలను పోషించేవాడు. అయితే సుమా జీవితంలో ఊహించని ఎదురు దెబ్బలు తగిలాయి.

భర్త, వెంటనే కొడుకు......దెబ్బ మీద దెబ్బ
రెండు సంవత్సరాల క్రితం సుమా భర్త చనిపోయాడు. కొడుకు, కూతురు ప్రియాంకతో కలసి సుమా ఒంటరి జీవితం గడిపింది. సుమా దగ్గర ఉన్న ఆస్తితో పాటు డబ్బు మొత్తం ఖాళీ అవుతూ వచ్చింది. కొన్ని నెలల క్రితం సుమా కుమారుడు చనిపోయాడు. భర్త, వెంటనే కుమారుడు చనిపోవడంతో సుమా తల్లడిల్లిపోయింది.

కూతురికి విషం పెట్టి చంపేసి ఉరి వేసుకున్న సుమా
ఉద్యోగం చేసి కుమార్తెను పోషించుకుందామంటే కూతురు ప్రియాంక వికలాంగురాలు కావడంతో ఆమెను వదలి ఏ పని చెయ్యలేక సుమా సతమతం అయ్యింది. రానురాను ఆర్థిక ఇబ్బందులతో సుమా సతమతం అయ్యింది.
కుమార్తె ప్రియాంకను పెంచి పోషించినా ఆమెకు సంతోషకరం అయిన జీవితం ఇవ్వలేనని సుమా డిసైడ్ అయ్యింది. ఇంట్లో కుమార్తె ప్రియాంకకు భోజనంలో విషం పెట్టి హత్య చేసిన సుమా తరువాత ఇంటిలో ఉరి వేసుకుంది. పక్కింటి వాళ్లు విషయం గమనించి సుమాను కిందకు దింపి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రియాంక ప్రాణం పోయిందని, కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications