Family: కుటుంబ పెద్దకు క్యాన్సర్, భార్య, కొడుకు ఏమైపోతారో అని భయం, ఒకేసారి ముగ్గురూ ఇంటిలో?!
బెంగళూరు: సంతోషంగా కాపురం చేసిన దంపతులు ఒ కొడక్కి తల్లిదండ్రులు అయ్యారు. కొడుకుతో పాటు హ్యాపీగా ఉంటున్న దంపతులకు కష్టాలు ఎదురైనాయి. కుటుంబ పెద్ద క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇప్పటికే వైద్యం చేయించుకుంటున్న భర్త క్యాన్సర్ వ్యాధి నయం కాదని తెలుసుకుని షాక్ అయ్యాడు.
తాను చనిపోతే భార్య, కొడుకు అనాథ అవుతారని భయపడిపోయి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. బెంగళూరు నగరంలోని జేపీ నగర్ లోని శ్రీనిధి లేఔట్ లోగ మహేష్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం జ్యోతి అనే యువతిని మహేష్ వివాహం చేసుకున్నాడు. భార్య జ్యోతితో మహేష్ సంతోషంగా కాపురం చేశాడు.

మహేష్, జ్యోతి దంపతులకు నందీష్ గౌడ అనే కుమారుడు ఉన్నాడు. భార్య జ్యోతి, కొడుకు నందీష్ తో మహేష్ చాలా సంతోషంగా జీవించాడు. హ్యాపీగా ఉంటున్న జ్యోతి, మహేష్ దంపతులకు కొన్ని సంవత్సరాల క్రితం కష్టాలు ఎదురైనాయి. అనారోగ్యంతో బాధపడుతున్న మహేష్ వైద్యుల దగ్గరకు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు.
మహేష్ కు క్యాన్సర్ వ్యాధి ఉందని వైద్యులు చెప్పారు. కొంతకాలం నుంచి మహేష్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఇప్పటికే వైద్యం చేయించుకుంటున్న మహేష్ క్యాన్సర్ వ్యాధి నయం కాదని తెలుసుకుని షాక్ అయ్యాడు. తాను చనిపోతే భార్య జ్యోతి, కొడుకు నందీష్ అనాథ అవుతారని మహేష్ భయపడిపోయి కఠిన నిర్ణయం తీసుకున్నాడు. భార్య జ్యోతి, కొడుకు నందీష్ కు విషయం పెట్టిన మహేష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. క్యాన్సర్ వ్యాధి దెబ్బకు కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.












Click it and Unblock the Notifications