బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Reddy: అజ్మీర్ దర్గాలో గాలి జనార్దన్ రెడ్డి, గాలి స్కెచ్ అదే అయితే ఆ పార్టీలకు చుక్కలు గ్యారెంటీ, ఫోకస్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/ అజ్మీర్/బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ దెబ్బకు బీజేపీ నాయకులకు సినిమా కనపడుతున్నదని తెలిసింది. కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ స్థాపించిన మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మంచి ఊపుమీద ఉన్నారని వెలుగు చూసింది. గతంలో బీజేపీలో చక్రం తప్పి కర్ణాటక రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న గాలి జనార్దన్ రెడ్డి ఒక్కసారిగా రూటు మార్చేశారు. దేశంలో ఎంతో పవిత్య పుణ్యక్షేత్రం అయిన ఆజ్మీర్ లో గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యక్షం అయ్యి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. గాలి జనార్దన్ రెడ్డి కొందరి మీద ఫోకస్ పెట్టారని, అదే జరిగితే ఆ పార్టీలకు చుక్కలు కనపడుతాయని తెలిసింది.

jump: పైన ఇంటిలో అంకుల్, కిందింటి ఆంటీ ఎస్కేప్, ఒకే బిల్డింగ్ లో జంబలకడి జారు మిఠాయి, కసితీరా!jump: పైన ఇంటిలో అంకుల్, కిందింటి ఆంటీ ఎస్కేప్, ఒకే బిల్డింగ్ లో జంబలకడి జారు మిఠాయి, కసితీరా!

అసెంబ్లీ ఎన్నికలు

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీకి గుడ్ బై చెప్పి కల్యాణ రాజ్య ప్రగతి పార్టీని స్థాపించిన కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి సోమవారం రాజస్థాన్‌లోని పవిత్ర పుణ్యక్షేత్రం అజ్మీర్ షరీఫ్ దర్గాను సందర్శించారు. తాను స్థాపించిన 'కల్యాణ రాజ్య ప్రగతి పార్టీకి అంతా మంచి జరగాలని, తన సెకండ్ ఇన్సింగ్ రాజకీయాలకు శుభంబ జరగాలని గాల జనార్దన్ రెడ్డి అజ్మీర్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారని ఆయన అనుచరులు అంటున్నారు.

గంగావతిలో పక్కాప్లాన్

గంగావతిలో పక్కాప్లాన్

గాలి జనార్దన్ రెడ్డి గంగావతి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా కర్ణాటకలోని అన్ని నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దింపేందుకు కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ సిద్ధమైంది. కొత్త రాజకీయ పార్టీని బలోపేతం చేసేందుకు వివిధ సంఘాలతో పాటు అన్ని పార్టీల అసంతృప్త నేతలతో టచ్ లో ఉన్న గాలి జనార్దన్ రెడ్డి స్థానిక ప్రజాప్రతినిధుల నివాసాలకు వెళ్లి కలుస్తున్నారు.

రెబల్స్ మీద ఎక్కువ శ్రద్ద?

రెబల్స్ మీద ఎక్కువ శ్రద్ద?

వివిద పార్టీలో ఉన్న నాయకులకు సముచిత స్థానం చిక్కడం లేదని ఇప్పటికే రగిలిపోతున్నారు. అలాంటి నాయకులను కలుస్తున్న గాలి జనార్దన్ రెడ్ి వారిని పరామర్శించి తనకు అలాంటి అన్యాయం జరిగింది, మీరు మా పార్టీలో చేరాలని వారిని కల్యాణ రాజ్య ప్రగతిలోకి ఆహ్వానిస్తున్నారని తెలిసింది. దీంతో భారీ ఎత్తున కల్యాణ రాజ్య ప్రగతి పార్టీలోకి వలసలు మొదలైనాయని తెలిసింది.

ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా?

ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా?

మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పార్టీ కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో ఊపకుందుకుంది. గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారంతో బీజేపీకి ఎదురుదెబ్బ తగలడంతో రెడ్డిని మళ్లీ బీజేపీలోకి తీసుకొచ్చేందుకు కొందరు నేతలు ప్రయత్నించారని సమాచారం. కొందర నేతలు ఇప్పటికే బెంగళూరులోని బీజేపీ పెద్దలు, ఢిల్లీలో హైకమాండ్ దగ్గర గాలి జనార్దన్ రెడ్డి వ్యవహారం విషయంలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని, గాలి జనార్దన్ రెడ్డి కారణంగా పార్టీకి కొత్త తలనొప్పులు రాకుండా చూసుకోవాలని చెబుతున్నారని తెలిసింది.

ఫస్ట్ లిస్ట్ లో 40 మంది అభ్యర్థులు?

ఫస్ట్ లిస్ట్ లో 40 మంది అభ్యర్థులు?

ఇదే ఏడాది కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ తరపున పోటీ చేసే 40 మంది అభ్యర్థుల జాబితాను త్వరలో గాలి జనార్దన్ రెడ్డి విడుదల చేస్తారని తెలిసింది. బీజేపీలోని కొందరు నాయకుల మీద రగిలిపోతున్న గాలి జనార్దన్ రెడ్డి వారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కల్యాణ రాజ్య ప్రగతి అనే కొత్త రాజకీయ పార్టీని స్థాపించారని ఆయన అభిమానులు అంటున్నారు.

గెలిచేవారికే సీటు

గెలిచేవారికే సీటు

కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ నుంచి పోటీ చెయ్యాలని ముందుకు వస్తున్న అభ్యర్థుల చరిష్మా, వారి గెలుపు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని పార్టీ టిక్కెట్లు ఇస్తామని, ఎన్నికల్లో ఏ పార్టీతో మా పార్టీ పొత్తు ఉండదని, కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ కర్ణాటకలోని అన్ని జిల్లాల్లో అభ్యర్థులను పోటీలో దింపుతుందని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి ఆయన కొత్త పార్టీ విషయంలో ఓ సర్వే నిర్వహిస్తున్నారని, గెలిచేవారికి పిలిచి సీట్లు ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి డిసైడ్ అయ్యారని తెలిసింది.

English summary
Former Minister, Mining King Gali Janardhan Reddy Appears in Ajmer, Special Pooja of Reddy in Ajmer Dargah, Gali Janardhan Reddy Focus on Rebels
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X