Illegal affair: భర్తకు బాయ్ బాయ్, ప్రియుడికి హాయ్, విడాకులు తీసుకుని ప్రియుడి చేతిలో ఫినిష్!

బెంగళూరు: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో చక్కగా కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. రానురాను భార్య ప్రవర్తనలో మార్పులు రావడంతో దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య తీరుతో విసిగిపోయిన భర్త ఆమెను చితకబాదడం మొదలు పెట్టాడు. భర్తకు బాయ్ బాయ్ చేప్పేసిన భార్య ఆమె బాయ్ ఫ్రెండ్ కు హాయ్ చెప్పింది. భర్తను వదిలేసి విడాకులు తీసుకుని అతనికి దూరంగా ఉంటున్న మహిళ ప్రియుడితో ఎంజాయ్ చేసింది.

అక్కడ ప్రియుడితో ఆమెకు గొడవలు మొదలైనాయి. దంపతుల గొడవ అయితే రాజీలు చెయ్యడానికి ముందుకు వెళ్లాలని కాని ఇలాంటి విషయాలు మనకు ఎందుకు అంటూ మహిళ, ఆమె ప్రియుడి విషయంలో బంధువులు ఏమాత్రం జోక్యం చేసుకోలేదు. ప్రియురాలి ఇంటికి వెళ్లిన ప్రియుడు ఆమెను శుభ్రంగా చంపేసి చేతులు దులుపుకున్నాడు.

దంపతుల మద్య గొడవలు

దంపతుల మద్య గొడవలు

బెంగళూరు నగరంలోని విజయనగరలో గాయిత్రి (27), రాజేష్ దంపతులు నివాసం ఉంటున్నారు. రాజేష్ ను వివాహం చేసుకున్న గాయిత్రి భర్తతో చక్కగా కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యింది. రానురాను భార్య ప్రవర్తనలో మార్పులు రావడంతో గాయిత్రీ, రాజేష్ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి.

భర్తకు బాయ్ బాయ్..... ప్రియుడికి హాయ్

భర్తకు బాయ్ బాయ్..... ప్రియుడికి హాయ్

భార్య గాయిత్రీ తీరుతో విసిగిపోయిన భర్త రాజేష్ ఆమెను చితకబాదడం మొదలు పెట్టాడు. తరువాత రాజేష్, గాయిత్రీ దంపతుల మధ్య గొడవలు చాలా ఎక్కువ అయ్యాయి. భర్త రాజేష్ కు అతని భార్య గాయిత్రీ బాయ్ బాయ్ చేప్పేసింది. రాజేష్, గాయిత్రీ దంపతుల విడాకులు తీసుకున్నారు, భర్తకు విడాకులు ఇచ్చేసిన తరువాత గాయిత్రి ఆమె బాయ్ ఫ్రెండ్ మంజు ప్రసాద్ కు హాయ్ చెప్పింది.

ప్రియుడితో ఎంజాయ్

ప్రియుడితో ఎంజాయ్

భర్త రాజేష్ కు దూరం అయిన తరువాత గాయిత్రీ విజయనగర సమీపంలోని పట్టేగారపాళ్యలో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నది. భర్త రాజేష్ కు పూర్తిగా దూరం అయిన గాయిత్రీ ఆమె ప్రియుడు మంజు ప్రసాద్ కు దగ్గర అయ్యింది. భర్తను వదిలేసిన గాయిత్రీతో ఆమె ప్రియుడు మంజు ప్రసాద్ పిచ్చపాటిగా ఎంజాయ్ చేస్తున్నాడు.

ప్రియుడితో కూడా గొడవలు ముదిరిపోయాయి

ప్రియుడితో కూడా గొడవలు ముదిరిపోయాయి

ప్రియుడు మంజు ప్రసాద్ అతని ప్రియురాలు గాయిత్రీకి గొడవలు మొదలైనాయి. గాయిత్రీ, మంజు ప్రసాద్ దంపతులు కాదని, ఆమె అతనితో అక్రమ సంబంధం పెట్టుకుందని స్ధానికులకు తెలుసు. దంపతుల గొడవ అయితే రాజీలు చెయ్యడానికి ముందుకు వెళ్లాలని కాని ఇలాంటి విషయాలు మనకు ఎందుకు అంటూ గాయిత్రీ, ఆమె ప్రియుడు మంజు ప్రసాద్ విషయంలో ఆమె బంధువులు ఏమాత్రం జోక్యం చేసుకోలేదు.

ఇంట్లో ప్రియురాలిని చంపేసిన ప్రియుడు

ఇంట్లో ప్రియురాలిని చంపేసిన ప్రియుడు

రాత్రి గాయిత్రీ, మంజు ప్రసాద్ విషయంలో గొడవ జరిగింది. మంజు ప్రసాద్, గాయిత్రీ గొడవ పడిన విషయం చుట్టుపక్కల వారికి వినపడింది తరువాత గాయిత్రీ గొంతు నులిమి చంపేసిన మంజు ప్రసాద్ ఇంటి బయట తాళం వేసుకుని అక్కడి నుంచి చెక్కేశాడు. మరుసటి రోజు విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గాయిత్రీని హత్య చేసి తప్పించుకుని పారిపోయిన మంజు ప్రసాద్ చివరికి పోలీసులకు చిక్కిపోయాడు. భర్తను వదిలేసి ప్రియుడు మంజు ప్రసాద్ తో ఎంజాయ్ చేసిన గాయిత్రీ చివరికి అతని చేతిలోనే హత్యకు గురికావడంతో ఆమె ఇద్దరు చిన్న పిల్లలు ఇప్పుడు రోడ్డునపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+