IPL: క్రికెట్ బెట్టింగ్, 23 ఏళ్లకే లక్షల్లో బెట్టింగ్ లు, రాత్రి ఫ్రెండ్స్ మద్య తేడా, నడిరోడ్డులో, ఫినిష్!
చిక్కమంగళూరు: చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న యువకులు ఇప్పుడు ప్రతిరోజు కలుస్తున్నారు. యవకులు మద్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్న యువకులు జల్సాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్ లో ఇద్దరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. క్రికెట్ ఆడుతున్న యువకులు క్రికెట్ బెట్టింగ్ లు కడుతున్నారు. ఇదే సమయంలో లక్షల రూపాయల క్రికెట్ బెట్టింగ్ కట్టిన యువకులు అప్పులపాలైనారని తెలిసింది.
ఈ విషయం ఓ గర్ల్ ఫ్రెండ్ కు తెలిసి ఆమె బాయ్ ఫ్రెండ్ ను దూరం పెట్టింది. రాత్రి పనిముగించుకుని ఇంటికి వెలుతున్న యువకుడిని అతని స్నేహితులు మాట్లాడారు. తరువాత స్నేహితుల మద్య ఓ విషయంలో గొడవలు జరిగాయి. తరువాత మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన యువకులు అతని స్నేహితుడిని దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్
కర్ణాటకలోని చిక్కమగళూరు సిటీలోని కోటే ప్రాంతంలో నాగరత్న, వనరాజ్ దంపతులు నివాసం ఉంటున్నారు. నాగరత్న, వనరాజ్ దంపతులకు దృవరాజ్ (23) అనే కొడుకు ఉన్నాడు. దృవరాజ్, ప్రమోద్ కుమార్, బాబు, సురేష్ తదితరులు చిన్నప్పటి నుంచి స్నేహితులుగా కలిసిమెలసి తిరిగారు. అందరి వయసు 23 సంవత్సరాలు ఉంది.

ఆర్థిక లావాదేవీలు
చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్న దృవరాజ్, ప్రమోద్ కుమార్, బాబు, సురేష్ తదితరులు ప్రతిరోజు కలుస్తున్నారు. దృవరాజ్, ప్రమోద్ కుమార్ అనే యవకుల యవకులు మద్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఉద్యోగాలు చేస్తున్న యువకులు జల్సాలు చేస్తున్నారు. ఫ్రెండ్స్ లో దృవరాజ్, ప్రమోద్ కుమార్ కు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని సమాచారం. క్రికెట్ ఆడుతున్న యువకులు క్రికెట్ బెట్టింగ్ లు కడుతున్నారు.

ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
ఇదే సమయంలో లక్షల రూపాయల క్రికెట్ బెట్టింగ్ కట్టిన యువకులు అప్పులపాలైనారని తెలిసింది. క్రికెట్ బెట్టింగ్ కడుతున్న దృవరాజ్ అతని స్నేహితుడు ప్రమోద్ కుమార్ దగ్గర రూ. 2 లక్షలకు పైగా అప్పు చేశాడని తెలిసింది. ఈ విషయం ఓ గర్ల్ ఫ్రెండ్ కు తెలిసి ఆమె బాయ్ ఫ్రెండ్ దృవరాజ్ ను దూరం పెట్టింది.

నడిరోడ్డులో దారుణ హత్య
రాత్రి పనిముగించుకుని ఇంటికి వెలుతున్న దృవరాజ్ ను ప్రమోద్ కుమార్, అతని స్నేహితులు అతన్ని నిలిపి మాట్లాడారు. నా దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వాలని ప్రమోద్ కుమార్ అతన స్నేహితుడు దృవరాజ్ కు తేల్చి చెప్పాడు. తరువాత స్నేహితుల మద్య డబ్బు విషయంలో గొడవలు జరిగాయి. తరువాత మాటామాటా పెరిగిపోవడంతో సహనం కోల్పోయిన యువకులు అతని స్నేహితుడు దృవరాజ్ ను దారుణంగా హత్య చెయ్యడం కలకలం రేపింది.

గంజాయి మత్తులోనే హత్య?
దృవరాజ్ ను హత్య చేసిన అతని స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రమోద్ కుమార్ తదితరులు గంజాయి సేవించి డబ్బు విషయంలో దృవరాజ్ తో గొడవపడి అతన్ని హత్య చేసి ఉంటారని పోలీసు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యువకులు అందరూ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్నారని పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications