బెంగళూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎంత మంది గెలుస్తారు?, జాతకాలు తారుమారు!
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా బెంగళూరులోని అన్ని నియోజక వర్గాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రత్యక్ష యుద్దం జరుగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు బెంగళూరులోని అనేక పోలింగ్ బూత్ ల్లో కాంగ్రెస్- బీజేపీ ఏజెంట్లు ఎక్కువగా దర్శనం ఇచ్చారు. కొన్ని నియోజక వర్గాల్లో జేడీఎస్ పార్టీ ఏజెంట్లు ఉన్నారు.
బెంగళూరులోని 28 నియోజక వర్గాలతో కలుపుకుంటే గ్రేటర్ బెంగళూరులో మొత్తం 32 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. బెంగళూరు గ్రామీణ జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సీట్లను కలుపుకుని గ్రేటర్ బెంగళూరు అంటారు. గ్రేటర్ బెంగళూరులోని 32 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ప్రత్యక్ష పోరు జరిగింది.

నాలుగు నియోజక వర్గాల్లో జేడీఎస్ పార్టీ బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి గట్టిపోటీ ఇచ్చింది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో 11 అసెంబ్లీ నియోజక వర్గాల్లో బీజేపీ విజయం సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికలో బెంగళూరులోని 17 అసెంబ్లీ నియోజక వర్గాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో బీజేపీ కంటే కాంగ్రెస్ పార్టీనే ఎక్కువ స్థానాల్లో విజయం సాధించింది.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బెంగళూరులో జేడీఎస్ పార్టీ నాలుగు సీట్లు సొంతం చేసుకుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్బంగా నాయకులు ఊహించిన దానికంటే బెంగళూరు ప్రజలు చాలా తక్కువ శాతం ఓట్లు వేశారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా సొంత ఊర్లకు కొందరు వెళ్లిపోతే కొందరు కుటుంబ సభ్యులతో కలిసి షికార్లు తిరిగేశారని ఆరోపణలు ఉన్నాయి.
2023 ఎగ్జిట్ పోల్స్ సందర్బంగా బెంగళూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేల పదవులు తారుమారు అయ్యే అవకాశం ఉందని వెలుగు చూసింది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే బెంగళూరులో బీజేపీ ఎక్కువ సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని తెలిసింది. పలు సర్వేలు, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు బెంగళూరులో బీజేపీకే ఎక్కువ అనుకూలంగా వస్తున్నాయి తెలిపాయి. అయితే మే 13వ తేదీన బెంగళూరు ఓటర్లు ఎవరికి జైకొట్టారు అనే విషయంలో పక్కా క్లారిటీ వస్తుంది.












Click it and Unblock the Notifications